TSPSC Group 1 Updates : అలర్ట్... గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే...?-tspsc has extended the deadline for group 1 applications 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 1 Updates : అలర్ట్... గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే...?

TSPSC Group 1 Updates : అలర్ట్... గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే...?

TSPSC Group 1 Updates 2024: గ్రూప్ 1 దరఖాస్తు(TSPSC Group 1 Applications) ప్రక్రియకు సంబంధించి కీలక అలర్ట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అప్లికేషన్ల గడువు సమయాన్ని మరో రెండు రోజులు పొడిగించింది.

తెలంగాణ గ్రూప్ 1 (https://www.tspsc.gov.in/)

TSPSC Group 1 Updates 2024 : గ్రూప్ 1 దరఖాస్తుల గడువు(TSPSC Group 1 Applications) పెంచుతున్నట్లు ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC). ఇవాళ్టితో గడువు ముగిసిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. మరో 2 రోజులపాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఫలితంగా దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు మార్చి 16వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు.

How to Apply TSPSC Group 1: గ్రూప్ 1 దరఖాస్తు ప్రాసెస్ ఇలా...

గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు https://www.tspsc.gov.in/ లోకి వెళ్లాలి.

ఓటీఆర్(OTR) లేని వారు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ లేకపోతే దరఖాస్తు చేసుకోలేం. ఓటీఆర్ ఉన్నవారు అప్డేట్ చేసుకోకపోతే చేసుకోవాలి.

TSPSC Group 1 Services ఆన్ లైన్ అప్లికేషన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ ఓటీఆర్ వివరాలను ఎంట్రీ చేయాలి.

అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.

ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ అర్హతలతో పాటు ముఖ్య వివరాలను ఎంట్రీ చేయాలి.

ఫొటో, సంతకాన్ని అప్ లోడ్ చేయాలి.

సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లు జనరేట్ కావాలంటే ఈ రిఫరెన్స్ నెంబర్ ఉపయోగపడుతుంది.

గ్రూప్ 1 నోటిఫికేషన్ ముఖ్య తేదీలు:

గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 19,2024.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 23, 2024.

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - మార్చి 14,2024.

దరఖాస్తుల ఎడిట్ - మార్చి 23 నుంచి మార్చి 27,2024.

హాల్ టికెట్లు డౌన్లోడ్ - పరీక్షకు 7 రోజుల ముందు నుంచి అందుబాటులోకి వస్తాయి.

ప్రిలిమ్స్ పరీక్ష - జూన్ 09 2024.

మెయిన్స్ పరీక్షలు - అక్టోబరు 21, 2024 నుంచి ప్రారంభం అవుతాయి.

అధికారిక వెబ్ సైట్ - https://www.tspsc.gov.in/

తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైంది. ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికిపైగా అప్లికేషన్లు చేసుకున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు రోజులు గడువు పెంచటంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అప్లికేషన్ల సంఖ్యపై మరింత స్పష్టత రానుంది.ఈ నోటిఫికేషన్ లో భాగంగా 563 ఉద్యోగాలను భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ. జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష ఉండగా, అక్టోబరు 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. పరీక్షలకు ఏడు రోజుల ముందుగా వెబ్ సైట్ లో హాల్ టికెట్లను తీసుకురానుంది.