TSPSC Group 1 Registration 2024 Updates: తెలంగాణలో 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి(TSPSC Group 1 2024) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభం కాగా... ఇవాళ్టి(మార్చి 14)తో ముగియనుంది. ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికిపైగా అప్లికేషన్లు చేసుకున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ చివరి తేదీ కావటంతో.... భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 5 లోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ(TSPSC) సూచించింది. అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఓటీఆర్(One Time Registration) తప్పనిసరిగా ఉండాలి.
గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 19,2024.
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 23, 2024.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - మార్చి 14,2024.
దరఖాస్తుల ఎడిట్ - మార్చి 23 నుంచి మార్చి 27,2024.
హాల్ టికెట్లు డౌన్లోడ్ - పరీక్షకు 7 రోజుల ముందు నుంచి అందుబాటులోకి వస్తాయి.
ప్రిలిమ్స్ పరీక్ష - జూన్ 09 2024.
మెయిన్స్ పరీక్షలు - అక్టోబరు 21, 2024 నుంచి ప్రారంభం అవుతాయి.
అధికారిక వెబ్ సైట్ - https://www.tspsc.gov.in/
ఇక గ్రూప్ 1(TS Group 1 Prelims Exam) పరీక్ష విధానం పరీశీలిస్తే..... ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తినే మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు.
ప్రిలిమినరీ పరీక్షను పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు.
ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి.
పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది.
ఇక 2వ దశలో నిర్వహించే మెయిన్ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి 900 మార్కులు కేటాయించారు.
ఈ 6 పేపర్లకు అదనంగా జనరల్ ఇంగ్లీష్ అర్హత పేపర్‌గా ఉంటుంది. ఈ పేపర్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి 3 గంటల సమయం కేటాయించారు.