APPSC Group 1 Hall Ticket 2024 : ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల... ఇలా డౌన్లోడ్ చేసుకోండి-download appsc group 1 prelims hall tickets 2024 from the website with this steps ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group 1 Hall Ticket 2024 : ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల... ఇలా డౌన్లోడ్ చేసుకోండి

APPSC Group 1 Hall Ticket 2024 : ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల... ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 10, 2024 11:07 AM IST

APPSC Group 1 Hall Tickets 2024 Download: ఏపీ గ్రూప్ -1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చాయి. మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష(Group 1 Prelim) జరగనుంది. హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ(APPSC) వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ గ్రూప్ 1 హాల్ టికెట్లు
ఏపీ గ్రూప్ 1 హాల్ టికెట్లు (https://portal-psc.ap.gov.in/Default.aspx)

APPSC Group 1 Prelims Hall Ticket 2024: ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రిలిమ్స్ పరీక్షపై అపోహలు నమ్మవదని తెలిపిన ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్… నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు మార్చి 10వ తేదీ నుంచి https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు(APPSC Group 1 Hall Ticket 2024 Download) అందుబాటులో ఉంటాయని… అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది.

APPSC Group 1 Prelims: 17న ప్రిలిమ్స్ పరీక్ష…

షెడ్యూల్ ప్రకారం మార్చి 17న గ్రూప్-1(AP Group 1 Prelims 2024) పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది.కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని సూచించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు.

How to Download AP Group 1 Hall Ticket 2024 : ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

గ్రూప్ 1 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మొదటగా ఏపీపీఎస్సీ అధికారి వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/ లోకి వెళ్లాలి.

హోమ్ పేజీలో ఉన్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 రిక్రూట్మెంట్ హాల్ టికెట్ పై క్లిక్ చేయాలి.

మీ OTRతో పాటు పాస్ వర్డ్ ను ఎంట్రీ చేసి లాగిన్ కావాలి. మీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.

మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే అప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ తప్పనిసరి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా హాల్ టికెట్ ను భద్రగా ఉంచుకోండి.

ప్రిలిమ్స్ పరీక్షా విధానం….

స్కీనింగ్ టెస్ట్ లో భాగంగా ముందు ప్రిలిమ్స్ పరీక్షAP group 1 Prelims 2024) నిర్వహిస్తారు. మొత్తం 240 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పేపర్-1లో 120 మార్కులకు 120 ప్రశ్నలు, పేపర్-2లో 120 మార్కులకు 120 మార్కులు అడుగుతారు. ఒక్కో పేపర్ కు గం. 2 ల సమయం కేటాయిస్తారు. పేపర్-1లో పార్ట్-ఏలో హిస్టరీ అండ్ కల్చర్, పార్ట్-బిలో రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పార్ట్-సిలో ఏపీ, ఇండినయ్ ఎకానమీ, ప్లానింగ్, పార్ట్-డిలో జాగ్రఫి నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతినిస్తారు. ఇక మెయిన్స్ రాత పరీక్షలో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి. వీటితోపాటు లాంగ్వేజెస్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. అయితే వీటిని క్వాలిఫైయింగ్ పరీక్షలుగా పరిగణిస్తారు. మొత్తం ఐదు పేపర్లలో ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ రాత పరీక్షను నిర్వహిస్తారు. మెయిన్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఖాళీల వివరాలు

డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు-9

ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌-18

డీఎస్పీ (సివిల్‌)- 26

రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌-6

డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు-5

జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌- 4

జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్స్- 3

అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌- 2

జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌- 1

జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌-1

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II-1

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌- 1

IPL_Entry_Point