APPSC Group2 Prelims: యథాతథంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్‌... వదంతులు నమ్మొద్దన్న APPSC.. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు-group 2 prelims as per schedule appsc urges to dont believe rumors ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group2 Prelims: యథాతథంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్‌... వదంతులు నమ్మొద్దన్న Appsc.. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు

APPSC Group2 Prelims: యథాతథంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్‌... వదంతులు నమ్మొద్దన్న APPSC.. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు

Sarath chandra.B HT Telugu
Published Feb 22, 2024 12:41 PM IST

APPSC Group2 Prelims: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమినరీ పరీక్ష యథాతథంగా జరుగుతుందని, పరీక్ష వాయిదాపై వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని కమిషన్ వర్గాలు సూచించాయి.

యథాతథంగా  ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్ష నిర్వహణ, ఆదివారం ప్రిలిమ్స్ పరీక్ష
యథాతథంగా ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్ష నిర్వహణ, ఆదివారం ప్రిలిమ్స్ పరీక్ష

APPSC Group2 Prelims: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ నిర్వహిస్తున్న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష యథాతథంగా జరుగుతుందని కమిషన్ స్పష్టం చేసింది. పరీక్ష వాయిదాపై వస్తున్న వదంతుల్ని Rumours నమ్మొద్దని సూచించింది. ఇప్పటికే దాదాపు నాలుగున్నర లక్షల మంది హాల్‌ టిక్కెట్లను Hall tickets డౌన్‌లోడ్ చేసుకున్నారని, మిగిలిన వారు కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.

గ్రూప్‌ 2 పరీక్ష కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్‌ లోడ్ చేసుకోవాలని, రెండు పరీక్షలకు హాజరయ్యే వారికి ఎస్‌బిఐ SBI మార్చి 4న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్‌బిఐ పరీక్షకు హాజరయ్యే వారు పరీక్ష తేదీ మార్పు కోసం ఐబిపిఎస్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. 23వ తేదీలోగా పరీక్ష తేదీ మార్పులకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆదివారం జరిగే గ్రూప్‌ 2 ప్రిలిమినరీ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1327 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్‌2 పరీక్షల్ని వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఎస్‌బిఐ పరీక్ష తేదీల మార్పు కోసం లేఖ రాసింది. ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహిస్తున్నందున ఎస్‌బిఐ పరీక్షకు హాజరయ్యే వారికి మరో తేదీ కేటాయించాలని కోరింది. దీనికి ఎస్‌బిఐ సానుకూలంగా స్పందించింది.

దాదాపు ఐదు లక్షల మంది గ్రూప్‌2 పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 550మంది ఎస్‌బిఐ పరీక్షకు కూడా హాజరు కావాల్సి ఉంది. ఏపీపీఎస్సీ విజ్ఞప్తితో ఎస్‌బిఐకు హాజరయ్యే వారికి మార్చి 4న పరీక్ష నిర్వహిస్తారు.

ఒకే రోజు గ్రూప్‌-2 ప్రిలిమ్స్, ఎస్‌బీఐ పరీక్షలు ఉన్నాయని గ్రూప్‌-2 పరీక్లుష వాయిదా వేయాలని పలు పార్టీలు డిమాండ్ చేశారు. దీంతో ఎస్‌బిఐ పరీక్షకు ఎంతమంది హాజరవుతున్నారో లెక్కించారు. గ్రూప్‌-2 పరీక్ష జరిగే ఈ25న ఎస్‌బీఐ పరీక్ష కూడా రాస్తున్నవారు 550 మందే ఉన్నారని తేలింది.దీంతో షెడ్యూల్ ప్రకారం గ్రూప్‌ 2 ప్రిలిమినరీ పరీక్షలు జరుగనున్నాయి.

550 మందికి మార్చి 4న పరీక్ష నిర్వహించేందుకు ఎస్‌బీఐ అంగీకారం తెలిపింది.ఈ నెల 25న ఎస్‌బిఐ పరీక్ష స్లాట్‌ కేటాయించిన అభ్యర్థులకు మరోరోజు అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. గ్రూప్‌-2, ఎస్‌బీఐ రెండు పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీని గతంలోనే ఎస్‌బిఐ కోరింది. దీంతో ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 19 వరకు రెండు పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను సేకరించారు. మొత్తం 550 మంది రెండు పరీక్షలు రాస్తున్నట్లు కమిషన్‌కు హాల్‌ టిక్కెట్లు సమర్పించారు. దీంతో వీరికి మార్చి 4న పరీక్ష నిర్వహిస్తామని ఎస్‌బీఐ తెలిపింది.

రెండు పరీక్షలు ఒకే తేదీల్లో వచ్చిన అభ్యర్థులు 23వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల్లోగా https://ibpsonline.ibps.in /sbijaoct23/ లో పరీక్ష తేదీ మార్పుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగేళ్లలలో ఏపీపీఎస్సీ దాదాపు 31నోటిఫికేషన్లు జారీ చేసి 6300ఉద్యోగాలను భర్తీ చేసింది. త్వరలో మరికొన్ని నోటిఫికేషన్లు ప్రకటించనున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. వారంలో మరో 5 నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.

Whats_app_banner