తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Centre Orders To Telangana : ఏపీకి తెలంగాణ నెల రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలి

Centre Orders To Telangana : ఏపీకి తెలంగాణ నెల రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలి

HT Telugu Desk HT Telugu

29 August 2022, 22:18 IST

google News
    • Union Government Orders To Telangana : ఏపీకి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఈ బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Electricity Dues : ఏపీకి నెల రోజుల్లో విద్యుత్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల సీఎం జగన్ దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఈ సమయంలో ఇతర అంశాలతోపాటుగా విద్యుత్ బకాయిలు గురించి కూడా చర్చించారు.

తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు.. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో కూడా సమావేశమయ్యారు జగన్. విభజన సమస్యలపైనా.. కేంద్రంతో మాట్లాడారు. విభజన సమస్యలు పరిష్కరించే విషయమై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత వారంలో ఈ కమిటీ దిల్లీలో సమావేశమైంది.

ఏపీకి చెల్లించాల్సిన రూ.3,441.78 కోట్లతో పాటు సర్ ఛార్జీని కూడా కలిపి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని తాజాగా ఆదేశించింది. 2014 జూన్ 2 నుండి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్ ను సరఫరా చేసినందుకు డబ్బులు చెల్లించలేదని కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

విద్యుత్ సరఫరాకు సంబంధించి రూ. 3,441.78 కోట్లు చెల్లించాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది. సకాలంలో ఈ నిధులు చెల్లించనందుకు ఆలస్య రుసుము కింద అదనంగా రూ.335.14 కోట్లు కూడా చెల్లించాలని చెప్పింది.

తదుపరి వ్యాసం