తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Ebc Nestham: నేడు నంద్యాల జిల్లా బనగానపల్లికి సిఎం జగన్.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల

YSR EBC Nestham: నేడు నంద్యాల జిల్లా బనగానపల్లికి సిఎం జగన్.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల

Sarath chandra.B HT Telugu

14 March 2024, 9:53 IST

    • YSR EBC Nestham: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మహిళా సాధికారతలో భాగంగా వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేయనున్నారు. 
నేడు నంద్యాలలో ఈబీసీ నేస్తం నిధుల విడుదల
నేడు నంద్యాలలో ఈబీసీ నేస్తం నిధుల విడుదల

నేడు నంద్యాలలో ఈబీసీ నేస్తం నిధుల విడుదల

YSR EBC Nestham: ఏపీ సిఎం జగన్  Ys Jaganనేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా నిధుల విడుదల చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

మహిళా సాధికారత సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఆర్థిక అనివార్యత కూడా అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాల మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్ధిక సాయం చేస్తోంది.

"వైఎస్సార్ ఈబీసీ నేస్తం"

రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద మహిళలకు రూ. 629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. నంద్యాల జిల్లా బనగానపల్లెలో Banganapalle బటన్ నొక్కి నేరుగా మహిళల ఖాతాల్లో ఈబీసీ నేస్తం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.

వైఎస్సార్ ఈబీసీ నేస్తం" ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన మహిళలకు ఏటా రూ. 15,000 చొప్పున 3 ఏళ్లలో మొత్తం రూ.45,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. మహిళలు స్వంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటును ప్రభుత్వం అందిస్తోంది.

వివిధ పథకాల ద్వారా మహిళలకు గత 58 నెలల్లో ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ, పరోక్ష బదిలీ పథకాలలో మొత్తం రూ. కోట్లలో 2,79,786 ఆర్ధిక సాయాన్ని పంపిణీ చేసినట్టు చెబుతోంది,.

గురువారం నంద్యాలలో అందిస్తున్న రూ. 629.37 కోట్లతో కలిపి ఇప్పటివరకు "వైఎస్సార్ ఈబీసీ నేస్తం" ద్వారా ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,876.97 కోట్లుగా పేర్కొన్నారు. ఒక్కో మహిళకుఈ పథకం ద్వారా మూడేళ్లలో రూ.45,వేల ఆర్ధిక సాయం అందించారు.

లా యూనివర్శిటీకి శంకుస్థాపన…

కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ. 1,011 కోట్లతో నిర్మించనున్న నేషనల్ “లా” యూనివర్సిటీకి నేడు భూమి పూజ చేయనున్నారు.

కర్నూలు జిల్లా జగన్నాథగట్టుపై 14 మార్చి 2024 ఉదయం 10 గంటలకు నేషనల్ "లా" యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. ఆనంతరం "వైఎస్సార్ ఈజీపీ నేస్తం" ఆర్థిక సాయాన్ని నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జను చేస్తారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

నేడు అనంతపురంలో సిఎం పర్యటన…

నంద్యాల జిల్లా బనగానపల్లి సభ అనంతరం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో సిఎం జగన్ పర్యటిస్తారు. రాంపురంరెడ్డి సోదరుల తల్లి ఎల్లారెడ్డి లలితమ్మ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు కొనకొండ్ల చేరుకుని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి లలితమ్మ అంతిమసంస్కార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డిల తల్లి లలితమ్మ బుధవారం మృతి, టీటీడీ బోర్డు సభ్యుడు సీతారామిరెడ్డి ఆమె కుమారులు కావడంతో సిఎం జగన్ వారికి సంతాపం తెలుపనున్నారు.

తదుపరి వ్యాసం