తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Break Darshan : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, వచ్చే మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Break Darshan : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, వచ్చే మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

06 April 2024, 18:32 IST

    • Tirumala Break Darshan : వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు నెలలు బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా తిరుమలలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేసింది.
తిరుమల బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Break Darshan : తిరుమల కొండపై వేసవి రద్దీ పెరుగుతోంది. టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తికావడం, స్కూళ్లకు వరుసగా సెలవులు రావడంతో తిరుమలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవిలో తిరుమల శ్రీవారి దర్శనానికి(Tirumala Darshan) వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ దర్శనాలకు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) వీఐపీ బ్రేక్ దర్శనాలు(VIP Break Darshan) రద్దు చేస్తున్నట్లు టీటీడీ(TTD) ప్రకటించింది. వేసవి దృష్ట్యా భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది. వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు చేస్తున్నట్ల టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బ్రేక్ దర్శనాల(Break Darshan) రద్దుతో సామాన్య భక్తుల దర్శనాలకు తక్కువ సమయం పడుతుందన్నారు. ఎన్నికల కోడ్ (Election Code)కారణంగా ఇప్పటికే సిఫార్సు లేఖ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఎండలు తీవ్రత పెరుగుతుండడంతో భక్తులకు క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ, అన్నప్రసాదం అందిస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు. మాడవీధుల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా కూల్ పెయింటింగ్ తో పాటు తాగునీటి సౌకర్యాలు కల్పించామన్నారు. వేసవి రద్దీలో భక్తులకు సాయపడేందుకు 2500 శ్రీవారి సేవకులతో పాటు టీటీడీ సిబ్బంది అందుబాటులో ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అలాగే శేషాచల అటవీ ప్రాంతాల్లో చెలరేగే ఆకస్మిక అగ్నిప్రమాదాలను నివారించేందుకు టీటీడీ అటవీ శాఖ, ప్రభుత్వ అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాయన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

ఉగాది పంచాంగశ్రవణం

ఏప్రిల్‌ 9న తిరుమల శ్రీవారి ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది(Krodhi Nama Ugadi) పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఆస్థాన పండితులు ఆస్థానం, పంచాంగశ్రవణం నిర్వహిస్తారన్నారు. ఇందులో దేశకాల, రుతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారఫలాలను పండితులు తెలియజేస్తారని చెప్పారు. క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని(TTD Panchangam) భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల, తిరుపతిలోని టీటీడీ బుక్‌స్టాళ్లలో అందుబాటులో ఉంచామన్నారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టీటీడీ(TTD) సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉందన్నారు.

ఏప్రిల్‌ 21 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తాళ్ళపాక అన్నమాచార్యల 521వ వర్థంతి ఏప్రిల్‌ 5న సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలోని వసంత మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను(Salakatla Vasanthotsavas) అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారమన్నారు. ఏప్రిల్‌ 22వ తేదీ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామి, అమ్మవార్లు స్వర్ణరథం(swarnaratham)పై ఊరేగి భక్తులకు దర్శనం ఇస్తారన్నారు.

ఒంటిమిట్ట కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు

టీటీడీకి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్ట(Vontimitta)లోని కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 22న సీతారాముల కల్యాణ మహోత్సవం(Sitarama Kalyanam) సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు విచ్చేసి బ్రహ్మోత్సవాల వైభవాన్ని తిలకించాలని కోరుతున్నామన్నారు.

టీటీడీ స్థానిక ఆలయాలలో బ్రహ్మోత్సవాలు(Tirupati Brahmotsavas)

ఏప్రిల్ 5 నుంచి 13వ తేదీ వరకు తిరుపతి(Tirupati)లోని కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్‌ 12 నుంచి 20వ తేదీ వరకు వాల్మీకిపురంలోని పట్టాభిరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్‌ 17 నుండి 25వ తేదీ వరకు చంద్రగిరిలోని కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో చెప్పారు.

తదుపరి వ్యాసం