తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Tickets 2024 : శ్రీవారి భక్తులకు అలర్ట్... జూన్ నెల ఆర్జిత‌సేవా టికెట్లు, సేవా కోటా విడుద‌ల‌, ముఖ్య తేదీలివే

Tirumala Tickets 2024 : శ్రీవారి భక్తులకు అలర్ట్... జూన్ నెల ఆర్జిత‌సేవా టికెట్లు, సేవా కోటా విడుద‌ల‌, ముఖ్య తేదీలివే

13 March 2024, 14:58 IST

    • Tirumala Tirupati Devasthanams Updates : శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుపతి తిరుపతి(Tirumala Tirupati) దేవస్థానం. జూన్ నెల శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీ‌వారి సేవ కోటా విడుద‌ల‌ తేదీలను ప్రకటించింది.
తిరుమల టికెట్లు
తిరుమల టికెట్లు

తిరుమల టికెట్లు

Tirumala Seva Tickets 2024: జూన్ నెల తిరుమల(Tirumala) శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీ‌వారి సేవ కోటా విడుద‌ల‌ తేదీలను ప్రకటించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

శ్రీవారి దర్శన టికెట్లు - వివరాలు

– మార్చి 18వ తేదీ ఉద‌యం 10 నుండి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల‌(Tirumala Arjita Seva Tickets 2024) ల‌క్కీడిప్ కోసం న‌మోదు చేసుకోవ‌చ్చు.

- మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

– మార్చి 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

– జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

– మార్చి 21న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్లు, ద‌ర్శ‌న టికెట్ల‌ కోటాను విడుద‌ల చేస్తారు.

– మార్చి 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్ర‌ద‌క్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.

– మార్చి 23న ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.

– మార్చి 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శ‌న‌టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు.

– మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న ట‌కెట్ల‌ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

– మార్చి 25న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.

– మార్చి 27న ఉద‌యం 11 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ కోటాను, అదేరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ కోటాను, మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) ఓ ప్రకటనలో తెలిపింది.

విమానయాన ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్(Srivari Trust News) డొనేషన్ కౌంటర్ ను తిరుపతి విమానాశ్రయం లో మార్చి 13 నుండి పున:ప్రారంభం అవుతుందని టీటీడీ తెలిపింది. గతంలో మాదిరిగానే శ్రీవాణి టికెట్లు విమాన ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొంది . భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించకోవాలని సూచించింది.

తదుపరి వ్యాసం