తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Ugadi Asthanam : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్-ఈ నెల 9న ఉగాది ఆస్థానం, పలు ఆర్జిత సేవలు రద్దు

Tirumala Ugadi Asthanam : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్-ఈ నెల 9న ఉగాది ఆస్థానం, పలు ఆర్జిత సేవలు రద్దు

07 April 2024, 15:24 IST

google News
    • Tirumala Ugadi Asthanam : తిరుమలలో ఈ నెల 9న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. బంగారు వాకిలిలో అర్చకులు, పండితులు పంచాగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. ఉగాది సందర్భంగా టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది.
తిరుమలలో ఉగాది ఆస్థానం
తిరుమలలో ఉగాది ఆస్థానం

తిరుమలలో ఉగాది ఆస్థానం

Tirumala Ugadi Asthanam : ఏప్రిల్ 9న తిరుమల(Tirumala Temple) శ్రీవారి ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం(Ugadi Asthanam) నిర్వహించనున్నారు. ఉగాది(Ugadi 2024) పండుగను పురస్కరించుకుని ముందుగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, విష్వక్సేనులకు విశేష నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ఆలయ ధ్వజస్తంభం చుట్టూ స్వామి వారు ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలతో అలంకరిస్తారు. అనంతరం బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. ఉగాది సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జితసేవలను(Arjitha Seva) టీటీడీ రద్దు చేసింది.

వచ్చే మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

వేసవిలో తిరుమల శ్రీవారి దర్శనానికి(Tirumala Darshan) వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ దర్శనాలకు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) వీఐపీ బ్రేక్ దర్శనాలు(VIP Break Darshan) రద్దు చేస్తున్నట్లు టీటీడీ(TTD) ప్రకటించింది. వేసవి దృష్ట్యా భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది. వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బ్రేక్ దర్శనాల(Break Darshan) రద్దుతో సామాన్య భక్తుల దర్శనాలకు తక్కువ సమయం పడుతుందన్నారు. ఎన్నికల కోడ్ (Election Code)కారణంగా ఇప్పటికే సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఎండలు తీవ్రత పెరుగుతుండడంతో భక్తులకు క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ, అన్నప్రసాదం అందిస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు. మాడవీధుల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా కూల్ పెయింటింగ్ తో పాటు తాగునీటి సౌకర్యాలు కల్పించామన్నారు. వేసవి రద్దీలో భక్తులకు సాయపడేందుకు 2500 శ్రీవారి సేవకులతో పాటు టీటీడీ సిబ్బంది అందుబాటులో ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

ఏప్రిల్ 9న‌ మహతిలో ఉగాది సంబరాలు

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 9వ తేదీ తిరుపతి(Tirupati)లోని మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీ ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థవారిచే వేదపారాయణం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 10 గంట‌ల‌కు వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తారు. అనంత‌రం అష్టావధానం, టీటీడీ ఉద్యోగుల పిల్లలతో ”తెలుగు వైతాళికులు” వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాద వితరణ ఉంటుంది.

తదుపరి వ్యాసం