తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Jobs 2024 : టీటీడీలో ఉద్యోగాలు - దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం, లింక్ ఇదే

TTD Jobs 2024 : టీటీడీలో ఉద్యోగాలు - దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం, లింక్ ఇదే

06 March 2024, 10:19 IST

google News
    • TTD Lecturer Jobs 2024 : టీటీడీలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మార్చి 5వ తేదీనే ప్రారంభమైంది. మార్చి 23వ తేదీ వరకు అప్లికేషన్లను సమర్పించుకోవచ్చు. 
టీటీడీలో ఉద్యోగాలు
టీటీడీలో ఉద్యోగాలు (TTD)

టీటీడీలో ఉద్యోగాలు

Tirumala Tirupati Devasthanam Lecturer Jobs 2024 : టీటీడీకి అనుబంధంగా ఉన్న కాలేజీలతో పాటు ఓరియంటర్ కళాశాల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 31వ తేదీన ఈ ఉద్యోగ ప్రకటన రాగా… ఇందులో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్(TTD Junior Colleges) ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 78 పోస్టులు ఉండగా…. ఇందులో 49 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 29 జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ మార్చి 5వ తేదీన ప్రారంభమైంది. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు మార్చి 25వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. డిగ్రీ లెక్చరర్‌(TTD Degree Colleges) పోస్టులకు మార్చి 7 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా…. మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి….

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన - ఏపీపీఎస్సీ

ఉద్యోగాలు - టీటీడీలో లెక్చరర్ ఉద్యోగాలు

ఉద్యోగాల ఖాళీలు - డిగ్రీ లెక్చరర్(49), జూనియర్ లెక్చరర్(29)(సబ్జెక్టుల వారీ జూనియర్ లెక్చరర్ ఖాళీలు: బోటనీ- 4, కెమిస్ట్రీ- 4, సివిక్స్‌- 4, కామర్స్‌- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1, హిస్టరీ- 4, మ్యాథమెటిక్స్‌- 2, ఫిజిక్స్- 2, తెలుగు- 3, జువాలజీ- 2 పోస్టులు ఉన్నాయి)

అర్హతలు - ఏపీకి చెందినవారై ఉండాలి. హిందూ మతానికి చెంది తగిన విద్యార్హతలు ఉండాలి. పీజీ, నెట్‌/ స్లెట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు అవుతారు.

జీతం - నెలకు డిగ్రీ లెక్చరర్‌కు రూ.61,960- రూ.1,51,370.

జూనియర్ లెక్చరర్‌కు - రూ.57,100- రూ.1,47,760 వేతనం ఉంటుంది.

దరఖాస్తులు - ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.

జూనియర్ లెక్చరర్ దరఖాస్తులు ప్రారంభం - మార్చి 05,2024

జూనియర్ లెక్చరర్ దరఖాస్తులకు తుది గడువు - మార్చి 25,2024.

డిగ్రీ లెక్చరర్ దరఖాస్తులు ప్రారంభం - మార్చి 07,2024.

డిగ్రీ లెక్చరర్ దరఖాస్తులకు తుది గడువు - మార్చి 27,2024.

ఆన్ లైన్ అప్లికేషన్ల లింక్ - https://applications-psc.ap.gov.in/LoginNew.aspx

ఏపీ ఉపాధి, శిక్షణ శాఖలో 71 ఉద్యోగ ఖాళీలు

APETD Recruitment Notification 2024 Updates: ఏపీ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. పలు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ITI)ల్లో అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 71 ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపాదికన రిక్రూట్ చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ ఉపాధి, శిక్షణ శాఖ వివరాలను వెల్లడించింది. దరఖాస్తుల ప్రక్రియ మార్చి 1వ తేదీనే ప్రారంభం కాగా... మార్చి 20వ తేదీలోపు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను సమర్పించుకోవచ్చు. మే 6వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది.

ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ ప్రకటన - ఏపీ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్

ఉద్యోగాలు -అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌(ATO)

మొత్తం ఖాళీలు -71

జోన్ల వారీగా పోస్టులు - జోన్ -1లో ట్రేడ్‌‌ల వారీగా ఖాళీలు చూస్తే డ్రెస్ మేకింగ్- 01, మెషినిస్ట్- 01. ఫిట్టర్- 2, కార్పెంటర్- 1,వెల్డర్- 01 పోస్టు ఉంది. ఇక జోన్ 2లో చూస్తే ఇంజినీరింగ్ డ్రాయింగ్- 01, టర్నర్- 03,మెషినిస్ట్- 01, మెకానిక్ డీజిల్- 1, ఫిట్టర్- 1, మ్యాథ్స్ కమ్ డ్రాయింగ్- 01 ఉద్యోగాలు ఉన్నాయి. జోన్ 3లో డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 02, ఫిట్టర్- 01 పోస్టులు ఉండగా... జోన్ 4 లో 54 ఖాళీలు ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు.

అర్హతలు - సంబంధిత కోర్సుల్లో బి.ఒకేషనల్‌/ డిగ్రీ/ డిప్లొమా/ ఎన్‌టీసీ / ఎన్‌ఏసీ ఉత్తీర్ణత పొందాలి. పని అనుభవం కూడా ఉండాలి. పోస్టును అనుసరించి నోటిఫికేషన్ లో వివరాలను పొందుపరిచారు.

వయోపరిమితి - 30/09/2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్లను బట్టి వయోసడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్

దరఖాస్తు ఫీజు - రూ.500 చెల్లించాలి.

దరఖాస్తులు ప్రారంభం - మార్చి 01,2024.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - మార్చి 20, 2024.

ఎంపిక విధానం - రాత పరీక్ష తో పాటు ప్రాక్టికల్‌ డెమో కూడా ఉంటుంది.

ఎగ్జామ్ విధానం - రాత పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రాత పరీక్షకు 70 మార్కులు, అనుభవానికి 10 మార్కులు, ట్రేడ్‌లో ప్రాక్టికల్ డెమోకు 20 మార్కులు కేటాయించారు. ఇందులో వచ్చే స్కోరింగ్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.

పరీక్ష జరిగే తేదీ: 06,మే, 2024.

అధికారిక వెబ్ సైట్ - http://detrecruitments.apcfss.in/

తదుపరి వ్యాసం