Railway Information : గుడ్ న్యూస్.. పండుగ సీజన్‌లో 10 ప్రత్యేక రైళ్లు.. రెండు రైళ్లు పునరుద్ధరణ
05 September 2024, 15:37 IST
- Railway Information : ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి, ఛత్ పండుగ సీజన్‌లో అదనపు రద్దీని తగ్గించడానికి.. సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి 10 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. వాటి వివరాలు ఈ కథనంలో..
పండుగ సీజన్‌లో 10 ప్రత్యేక రైళ్లు
వరుస పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా సర్వీసులు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. 10 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని వెల్లడించారు. అలాగే వరదల కారణంగా రద్దు చేసిన పూరి- తిరుపతి, చెన్నై సెంట్రల్- ఎస్ఎంవీడీ కాట్రా ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించారు. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు వన్ వే ఏసీ ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చారు. వరదల కారణంగా రైల్వే ట్రాక్‌లు ధ్వంసం కావడంతో సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో 13 రైళ్లు రద్దు చేశారు.
పది ప్రత్యేక రైళ్లు..
1. సికింద్రాబాద్‌లో బయలుదేరే సికింద్రాబాద్ - విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07097 ) రైలు సెప్టెంబర్ 8 నుండి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.
2. విశాఖపట్నంలో బయలుదేరే విశాఖపట్నం-సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07098) రైలు సెప్టెంబర్ 9 నుండి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది.
3. సికింద్రాబాద్‌లో బయలుదేరే సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07027) రైలు సెప్టెంబర్ 6 నుండి నవంబర్ 29 అందుబాటులో ఉంటుంది.
4. బ్రహ్మపూర్ నుండి బయలుదేరే బ్రహ్మపూర్ - సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07028) రైలు సెప్టెంబర్ 7 నుండి నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
5. భువనేశ్వర్‌లో బయలుదేరే భువనేశ్వర్ - బెలగావి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (02813) రైలు సెప్టెంబర్ 7 నుండి నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
6. బెలగావిలో బయలుదేరే బెలగావి-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ (02814) రైలు సెప్టెంబర్ 9 నుండి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది.
7. తిరుపతిలో బయలుదేరే తిరుపతి- శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07440) రైలు అక్టోబర్ 10 నుండి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.
8. శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరే శ్రీకాకుళం రోడ్- తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07441) రైలు అక్టోబర్ 7 నుండి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది.
9. నాందేడ్‌లో బయలుదేరే నాందేడ్ - బెర్హంపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07431) రైలు అక్టోబర్ 12 నుండి నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
10. బెర్హంపూర్ నుండి బయలుదేరే బెర్హంపూర్- నాందేడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07432) రైలు అక్టోబర్ 13 నుండి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.
సర్వీసుల పునరుద్ధరణ..
పూరీ నుండి బయలుదేరే పూరీ- తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17479) సెప్టెంబర్ 5 నుండి యథావిధిగా నడుస్తుంది. వరదల కారణంగా తొలిత ఈ రైలును రద్దు చేశారు. అయితే రైల్వే లైన్లు క్లియర్ కావడంతో.. ఈ రైలును పునరుద్ధరించారు. రద్దు కాకుండా షెడ్యూల్ ప్రకారం సాధారణ మార్గంలో నడుస్తుంది. చెన్నై సెంట్రల్- ఎస్ఎంవీడీ కాట్రా ఎక్స్‌ప్రెస్ (16031)ను కూడా దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది.
13 రైళ్లు రద్దు..
1. గుంటూరు నుండి బయలుదేరే గుంటూరు- విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239) రైలును సెప్టెంబర్ 5 వరకు రద్దు చేశారు.
2. షిర్డీ నుండి బయలదేరే సాయినగర్ షిర్డీ- కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ (17205) రైలును సెప్టెంబర్ 5 వరకు రద్దు చేశారు.
3. ఎస్ఎంవీటీ బెంగళూరు నుండి బయలుదేరే ఎస్ఎంవీటీ బెంగళూరు- దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (03260) రైలును సెప్టెంబర్ 5 వరకు రద్దు చేశారు.
4. గుంటూరు నుండి బయలుదేరే గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243) రైలును సెప్టెంబర్ 5 వరకు రద్దు చేశారు.
5. సికింద్రాబాద్‌లో బయలుదేరే సికింద్రాబాద్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ (12706) రైలును సెప్టెంబర్ 5 వరకు రద్దు చేశారు.
6. గుంటూరులో బయలుదేరే గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12705) రైలును సెప్టెంబర్ 5 వరకు రద్దు చేశారు.
7. భద్రాచలంలో బయలుదేరే భద్రాచలం - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17660) రైలును సెప్టెంబర్ 5 వరకు రద్దు చేశారు.
8. హౌరా నుండి బయలుదేరే హౌరా- మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22817) రైలును సెప్టెంబర్ 6 వరకు రద్దు చేశారు.
9. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం- గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240) రైలును సెప్టెంబర్ 6 వరకు రద్దు చేశారు.
10. రాయగడ నుండి బయలుదేరే రాయగడ- గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17244) రైలును సెప్టెంబర్ 6 వరకు రద్దు చేశారు.
11. కొచ్చువేలి నుండి బయలుదేరే కొచ్చువేలి- షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06081) రైలును సెప్టెంబర్ 6 వరకు రద్దు చేశారు.
12. కన్యాకుమారి నుండి బయలుదేరే కన్యాకుమారి- హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12666) రైలును సెప్టెంబర్ 7 వరకు రద్దు చేశారు.
13. తిరునెల్వేలి నుండి బయలుదేరే తిరునెల్వేలి - పురూలియా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22606) రైలును సెప్టెంబర్ 7 వరకు రద్దు చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)