తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Indian Maritime University : విశాఖ మారిటైమ్ వ‌ర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్

Indian Maritime University : విశాఖ మారిటైమ్ వ‌ర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్

HT Telugu Desk HT Telugu

03 October 2024, 18:27 IST

google News
    • Indian Maritime University : విశాఖ ఐఎంయూలో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అక్టోబ‌ర్ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అర్హతలు, వయో పరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ గురించి వర్సిటీ అధికారులు వివరాలు వెల్లడించారు.
విశాఖ ఐఎంయూ
విశాఖ ఐఎంయూ

విశాఖ ఐఎంయూ

విశాఖ‌ప‌ట్నంలోని ఇండియన్ మారిటైమ్ యూనివ‌ర్సిటీ (ఐఎంయూ)లో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. దర‌ఖాస్తు దాఖ‌లు చేసుకునేందుకు ఆఖ‌రు తేదీ అక్టోబ‌ర్ 14గా నిర్ణ‌యించారు. కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. మొత్తం ఏడు పోస్టులు ఉండగా.. అందులో నాలుగు టీచింగ్‌, మూడు నాన్ టీచింగ్ పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. టీచింగ్ పోస్టుల్లో ఫ్యాక‌ల్టీ కాగా, నాన్ టీచింగ్ పోస్టులలో డిప్యూటీ రిజిస్ట్రార్‌, సీనియ‌ర్ టెక్నీషియ‌న్‌, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. టీచింగ్ పోస్టుల్లో ఓషియ‌న్‌, డ్రెడ్జింగ్‌, మెరైన్‌, నావ‌ల్ ఆర్కిటెక్చ‌ర్ అండ్ బిల్డింగ్ త‌దిత‌ర పోస్టులు ఉన్నాయి.

అర్హ‌త‌లు..

ఓషియ‌న్ ఇంజ‌నీరింగ్, డ్రెడ్జింగ్ ఇంజ‌నీరింగ్‌ ఫ్యాక‌ల్టీ పోస్టుల‌కు క‌నీసం 55 శాతం మార్కుల‌తో యూజీ, పీజీ చేయాలి. యూజీలో సివిల్‌, మెకానిక‌ల్ ఇంజనీరింగ్, పీజీలో ఓషియ‌న్‌, కోస్ట‌ల్, మెరైన్‌, హార్బ‌ర్ ఇంజ‌నీరింగ్ చేయాలి. పీహెచ్‌డీ పూర్తి చేయాలి.

మెరైన్ ఇంజ‌నీరింగ్‌ ఫ్యాక‌ల్టీ పోస్టుకు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ (షిప్పింగ్‌) గుర్తింపు పొందిన ఎంఈఓ క్లాస్ 1 స‌ర్టిఫికేట్‌, ఆరు నెలల పాటు సెయిలింగ్ అనుభవం ఉండాలి. పీహెచ్‌డీ పూర్తి చేయాలి. బీఈ, బీటెక్‌లో మెరైన్ ఇంజనీరింగ్‌లో 55 శాతం మార్కుల‌తో, ఎంఈ, ఎంటెక్‌లో 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించాలి.

నావ‌ల్ ఆర్కిటెక్చ‌ర్ అండ్ బిల్డింగ్ ఫ్యాక‌ల్టీ పోస్టుకు క‌నీసం 55 శాతం మార్కుల‌తో యూజీ, పీజీ చేయాలి. యూజీలో నావల్ ఆర్కిటెక్చ‌ర్‌, షిప్ బిల్డింగ్‌, ఓషియ‌న్ ఇంజినీరింగ్, పీజీలో నావ‌ల్ ఆర్కిటెక్చ‌ర్‌, మెరైన్‌, స్ట‌క్చ‌ర‌ల్ ఇంజనీరింగ్‌, థ‌ర్మ‌ల్‌, ప్రొడ‌క్స‌న్ త‌దిత‌ర చేయాలి. పీహెచ్‌డీ పూర్తి చేయాలి.

సీనియ‌ర్ టెక్నీషియ‌న్ (నావ‌ల్ ఆర్కిటెక్చ‌ర్‌) పోస్టుకు మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేయాలి. షిప్ బిల్డింగ్ ఇంజ‌నీరింగ్‌లో డిప్లొమా, ఐఎంయూలో బ్యాచిల‌ర్ సైన్ డిగ్రీ (షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ చేసి ఉండాలి.

డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుకు మాస్ట‌ర్ డిగ్రీలో 55 శాతం మార్కులు ఉండాలి. ఉన్నత విద్యా సంస్థ‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, లేదా దానికి స‌మాన‌మైన అడ్మినిస్ట్రేష‌న్ పోస్టులో ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ గ్రూప్-ఏ ఆఫీస‌ర్ (రాష్ట్రంలో జాయింట్ సెక్ర‌ట‌రీ, కేంద్రంలో డిప్యూటీ సెక్ర‌ట‌రీ) అయి ఉండాలి. లేక‌పోతే ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన అడ్మినిస్ట్రేష‌న్ అనుభ‌వం ఉండాలి.

రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు 50 శాతం మార్కుల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప‌నికి సంబంధించిన స‌మాచారంపై ప‌రిజ్ఞానం, క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ తెలిసి ఉండాలి.

వ‌యో ప‌రిమితి..

ఫ్యాక‌ల్టీ పోస్టుల‌కు వ‌యో ప‌రిమితి 65 ఏళ్ల మించి ఉండ‌కూడదు. డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుల‌కు వ‌యో ప‌రిమితి 64 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. సీనియ‌ర్ టెక్నీషియ‌న్‌, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు వ‌యో ప‌రిమితి 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.

ఏలా ద‌ర‌ఖాస్తు చేయాలి?

ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. అక్టోబ‌ర్ 15 లోపు ద‌ర‌ఖాస్తును దాఖ‌లు చేసుకోవాలి. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ డైరెక్ట్ లింక్‌ https://docs.google.com/forms/d/e/1FAIpQLSenIplKajvMMfPwGGYGd4dkRp--R3xTOQ-Lige5wQoMKTkPqw/viewform ను క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తును దాఖ‌లు చేసుకోవ‌చ్చు. అలాగే నోటిఫికేష‌న్‌కు సంబంధించిన ఇత‌ర వివ‌రాలు కావాలంటే యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://www.imu.edu.in/imunew///uploads/files/recruitments/2024/Eligibilty_Criteria_IMUV.pdf ను క్లిక్ చేస్తే వివ‌రాలు ఓపెన్ అవుతాయి.

ఎంపిక ప్ర‌క్రియ‌..

సీనియ‌ర్ టెక్నీషియ‌న్ (నావ‌ల్ ఆర్కిటెక్చ‌ర్‌), రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల‌కు మాత్ర‌మే స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫ్యాక‌ల్టీ పోస్టులు, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుకు ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు స్కిల్ టెస్ట్‌ తేదీ అక్టోబ‌ర్ 9. ఆ రోజున ఉద‌యం 10 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు స్కిల్ టెస్ట్‌ జ‌రుగుతుంది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం