Mister Celebrity Movie: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ సీనియ‌ర్ రైట‌ర్‌ మ‌న‌వ‌డు - సెలిబ్రిటీ రూమ‌ర్స్‌పై మూవీ-tollywood senior writer paruchuri venkateswara rao grand son to dubet as hero with mister celebrity movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mister Celebrity Movie: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ సీనియ‌ర్ రైట‌ర్‌ మ‌న‌వ‌డు - సెలిబ్రిటీ రూమ‌ర్స్‌పై మూవీ

Mister Celebrity Movie: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ సీనియ‌ర్ రైట‌ర్‌ మ‌న‌వ‌డు - సెలిబ్రిటీ రూమ‌ర్స్‌పై మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Sep 04, 2024 02:19 PM IST

Mister Celebrity Movie: టాలీవుడ్ సీనియ‌ర్ రైట‌ర్ ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు ప‌రుచూరి సుద‌ర్శ‌న్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. మిస్ట‌ర్ సెల‌బ్రిటీ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. సెలిబ్రిటీల‌పై వ‌చ్చే రూమ‌ర్స్‌తో ఈ సినిమాను ద‌ర్శ‌కుడు చందిన ర‌వికిషోర్ తెర‌కెక్కించాడు.

మిస్ట‌ర్ సెల‌బ్రిటీ మూవీ
మిస్ట‌ర్ సెల‌బ్రిటీ మూవీ

Mister Celebrity Movie: టాలీవుడ్ సీనియ‌ర్ రైట‌ర్ ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుద‌ర్శ‌న్‌ పరుచూరి మిస్టర్ సెలిబ్రిటీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాకు చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుద‌ర్శ‌న్ ప‌రుచూరితో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మిస్ట‌ర్ సెలిబ్రిటీ మూవీ టీజ‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు.

పుకార్ల వ‌ల్ల‌...

రామాయణం కాలంలో చాకలి వాడు అన్న పుకార్ల మాటలకు సీతాదేవీ అరణ్య వాసం, అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది.. కాలం మారింది కానీ ఈ పుకారు మాటల వల్ల పోయే ప్రాణాలు ఇంకా పోతూనే ఉన్నాయి’ అంటూ టీజ‌ర్‌లో వినిపించే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాల‌తో టీజ‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. సెలిబ్రిటీల‌పై నిత్యం వినిపించే రూమర్లు, పుకార్లను బేస్ చేసుకుని ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది.

హీరోలు కొడుకులు హీరోల అవుతారు...

ఈ సంద‌ర్భంగా ప‌రుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘హీరోల కొడుకులు హీరోలు అవుతుంటారు.. కానీ మా మనవడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమాలో ప్రేక్షకుడు ఊహించింది జరగాలి.. కానీ ఊహించని టైంలో జరగాలి. అలాంటి మ్యాజిక్‌ ఈ మూవీలో క‌నిపిస్తుంది. ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.

సినిమా క‌ష్టాలు చూశా...

పరుచూరి సుదర్శన్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీతో ఇండస్ట్రీలోకి పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. నేను హీరో అవుతానని చెప్పగానే మా తాత గారు నాకు కొన్ని పరీక్షలు పెట్టారు. ఎవ్వరికీ నా గురించి చెప్పకుండా జూనియర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల‌కు పని చేశాను. సినిమా కష్టాలన్నీ దగ్గరగా చూశాను. ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ విషయాన్ని మా తాత గారికి చెప్పాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించు అని చెప్పారు.’ అని తెలిపాడు.

ప్ర‌యోగాత్మ‌కంగా...

‘మిస్టర్ సెలెబ్రిటీ కథ చాలా డిఫరెంట్‌గా, ప్రయోగాత్మకంగా ఉంటుంది. సాధారణ వ్యక్తి నుంచి సెలెబ్రిటీల వరకు ఇబ్బంది పడే ఇష్యూని సినిమాలో చూపించాను. చిన్న సమస్యలే కదా? చిన్న మాటలే కదా? అనిపించొచ్చు. కానీ ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ సినిమాలో ఉంటుంది. ఈ మూవీకి క్లైమాక్స్ చాలా కొత్త‌గా ఉంటుంది’ అని ద‌ర్శ‌కుడు చెప్పాడు.

టైటిల్‌లోనే పాజిటివిటీ...

సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ...‘మిస్టర్ సెలెబ్రిటీ అనే టైటిల్‌లోనే చాలా పాజిటివిటీ ఉంది.. తెలిసింది మాట్లాడితే స్వేచ్చ.. తెలియంది మాట్లాడితే నేరం.. తెలిసింది నిజం అనుకుని మాట్లాడటం పొరపాటు.. తెలుసు అనుకుని మాట్లాడటం మహా పాపం.. చాలా మంచి పాయింట్‌తో సినిమాను తీశారు. సుదర్శన్ మంచి నటుడు. నా గురువు గారి మనవడు. నేను కూడా సుదర్శన్‌తో ఒక సినిమా చేస్తున్నాను. త్వరలోనే దానికి సంబంధించిన ప్రకటన వస్తుంది.’ అని పేర్కొన్నాడు.

టాపిక్