Tejus Kancherla: వెరైటీ టైటిల్‌తో హుషారు హీరో మూవీ - ఉరుకు పటేల ఫస్ట్ లుక్ రిలీజ్
Tejus Kancherla: హుషారు ఫేమ్ తేజస్ కంచెర్ల హీరోగా నటిస్తోన్న ఉరుకు పటేల ఫస్ట్ లుక్‌ను గురువారం రిలీజైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది.
Tejus Kancherla: హుషారు ఫేమ్ తేజస్ కంచెర్ల వెరైటీ టైటిల్‌తో ఓ మూవీ చేస్తోన్నాడు. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఉరుకు పటేల అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం రిలీజ్ చేశారు. డిఫరెంట్‌గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది.
మంగళసూత్రం...పోస్టల్ బ్యాలెట్....
ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే పల్లెటూరులోని రోడ్డుపై తేజస్ కంచర్ల పరిగెడుతుంటే అతని వెనుక ఎవరో కత్తిని విసిరేసినట్లు కనిపిస్తుంది. మరో వైపు మంగళసూత్రం, పోస్టల్ బ్యాలెట్ పేపర్, పాల క్యాన్ అన్నీ కనిపిస్తున్నాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ, ఎమోషన్స్ ప్రధానంగా ఉరుకు పటేల మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో..
టైటిల్ చూస్తుంటే తెలంగాణ, యాసభాషలతో ఉరుకు పటేల సినిమా రూపొందుతోన్నట్లు కనిపిస్తోంది. టైటిల్ కింద ఉన్న గెట్ ఉరికిఫైడ్ అనే క్యాప్షన్ కూడా కొత్తగా ఉంది. పల్లెటూళ్లలోని రాజకీయాలు, గొడవలను వినోదాత్మక పంథాలో ఈ మూవీలో చూపించబోతున్నట్లు సమాచారం. అంతర్లీనంగా ఓ మెసేజ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ ఎవరు?
ఉరుకు పటేలా మూవీకి వివేక్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్నాడు. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పైకంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు అందిస్తోన్నాడు.
ఈ సినిమాలో తేజస్ కంచెర్లకు జోడీగా నటిస్తోన్న హీరోయిన్ ఎవరన్నది మేకర్స్ రివీల్ చేయలేదు. నటీనటుల వివరాల్ని కూడా వెల్లడించలేదు. ఉరుకు పటేల సినిమా చిత్రీకరణ పూర్తయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని చెప్పారు.
హుషారుతో ఫస్ట్ హిట్...
హుషారు మూవీతో తెలుగులో సక్సెస్ అందుకున్నాడు తేజస్ కంచెర్ల. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో నలుగురు హీరోల్లో ఒకరిగా కనిపించాడు. హర్ష కొనుగొంటి దర్శకత్వంలో చిన్న సినిమాగా రూపొందిన హుషారు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.
బోల్డ్ మూవీలో...
పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించి బోల్డ్ మూవీ ఆర్‌డీఎక్స్ లవ్‌లో తేజస్ హీరోగా నటించాడు. కేటుగాడు పేరుతో మాస్ సినిమా చేసిన తేజస్ కొంత విరామం తర్వాత ఉరుకు పటేలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో ప్రకాష్ రాజ్ ఉరు సమయిల్ అరాయిల్‌తో పాటు మరో సినిమా చేశాడు తేజస్.