BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తులకు రేపే ఆఖరు తేదీ, ఇవిగో లింక్స్-br br ambedkar open university online admissions will end on september 30 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Braou Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తులకు రేపే ఆఖరు తేదీ, ఇవిగో లింక్స్

BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తులకు రేపే ఆఖరు తేదీ, ఇవిగో లింక్స్

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 29, 2024 09:47 AM IST

Ambedkar Open University Admissions 2024: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 30వ తేదీతో పూర్తి అవుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవాలి.

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు జారీ కాగా… గడువు కూడా పూర్తి అయింది. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ గడువు పొడిగించారు. ఈ గడువు కూడా రేపటి(సెప్టెంబర్ 30)తో పూర్తి కానుంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

తాజా నోటిఫికేషన్ల ప్రకారం… డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను పొందవచ్చు. www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సుల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు.

బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో వీటిని పూర్తి చేయవచ్చు. ఆయా కోర్సులను బట్టి ఫీజులు ఉంటాయి. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు.

ముఖ్య వివరాలు :

  • హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు.
  • పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తోంది.
  • ఆన్ లైన్ దరఖాస్తుల రుసుంతో పాటు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు.
  • అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో వీటిని పూర్తి చేయవచ్చు.
  • ఏడాది లేదా ఆరు నెలల కాలంలో పూర్తి చేసే డిప్లోమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
  • కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. 
  • మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ముఖ్యమైన లింక్స్ ఇవే:

ఇగ్నోలో అడ్మిషన్లు - రేపే లాస్ట్ డేట్:

మరోవైపు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2024 సెషన్  అడ్మిషన్ల గడువు కూడా రేపటితోనే పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు www.ignou.ac.in, www.ignouadmission వెబ్​సైట్ల ​ద్వారా ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 

డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోనూ సంబంధింత ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు వారిని సంప్రదించవచ్చు. లేదా ఆన్‌లైన్‌లోనే నేరుగా చేసుకోవచ్చు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), డిగ్రీ ఆనర్స్, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం మొత్తం 17 రకాల డిగ్రీ ప్రోగ్రామ్స్​ను ఆఫర్ చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ప్రాంతీయ కేంద్ర పరిధిలోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సుల వివరాలు, ఫీజులు, పరీక్షల విధానం వంటి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.

Whats_app_banner