ECIL Recruitment 2023: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 363 గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA), డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) పోస్ట్ ల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లికేషన్ ఫామ్ లను ఆన్ లైన్ లో సబ్మిట్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 15. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈసీఐఎల్ (ECIL) అధికారిక వెబ్‌సైట్ careers.ecil.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 363 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. వాటిలో 250 పోస్ట్ లు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA)లకు, 113 పోస్ట్ లు డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) లకు రిజర్వ్ చేశారు. ఈ రెండు కేటగిరీల అప్రెంటిస్‌షిప్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాలు మించి ఉండకూడదు.
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA) పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా AICTE-ఆమోదిత కళాశాల లేదా గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుంచి నాలుగు సంవత్సరాల బీఈ (B.E) లేదా బి.టెక్ (B.Tech) పూర్తి చేసి ఉండాలి వీరు ఏప్రిల్ 1, 2021 నాటికి ఈ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే, డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) లకు అప్లై చేసే అభ్యర్థులు మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.