తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Case Filed On Srireddy : చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు- టాలీవుడ్ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

Case Filed on Srireddy : చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు- టాలీవుడ్ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

20 July 2024, 17:51 IST

google News
    • Case Filed on Srireddy : టాలీవుడ్ నటి, వైసీపీ మద్దతుదారు శ్రీరెడ్డిపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసుల కేసు ఫైల్ చేశారు.
టాలీవుడ్ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు
టాలీవుడ్ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

టాలీవుడ్ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

Case Filed on Srireddy : టాలీవుడ్ నటి, వైసీపీ మద్దతుదారు శ్రీరెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యపై కర్నూలు టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కర్నూలు మూడో పట్టణ పోలీసుల శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో త్వరలోనే శ్రీరెడ్డిని విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. ఆమె వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు అంటున్నారు.

తనపై కేసు నమోదుపై శ్రీరెడ్డి ఫేస్ బుక్ వేదిక స్పందించారు. కడప, హైదరాబాద్, కర్నూలులో తనపై కేసులు నమోదయ్యాయంట, ఎంజాయ్ టీడీపీ బ్యాచ్ అని పోస్టు పెట్టారు.

"ఎన్నికలకు ముందు, ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులపై, వారి కుటుంబ సభ్యులపై నటి శ్రీరెడ్డి దిగజారి మాట్లాడారు. మహిళలు సైతం అసహ్యించుకునే విధంగా, సభ్యసమాజం తలదించుకునేలా శ్రీరెడ్డి మాట్లాడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కర్నూలు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాను" -రాజు యాదవ్, టీడీపీ నేత

టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా కించపరించేలా శ్రీరెడ్డి మాట్లాడారని, ఆమెపై తగిన చర్యల తీసుకోవాలని రాజు యాదవ్ డిమాండ్ చేశారు. శ్రీరెడ్డి పరిధిదాడి మాట్లాడుతున్నారని, ఈమెను ఆదర్శంగా చేసుకుని మిగిలిన వాళ్లు కూడా ఇలానే మాట్లాడే అవకాశాలున్నాయన్నారు. అందుకే శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలన్నారు.

సినీ నటి, యూట్యూబర్ శ్రీరెడ్డి వైసీపీ మద్దతుదారు. ఆమె పవన్ కల్యాణ్, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా తరచూ విమర్శలు చేస్తుంటారు. వైసీపీ ప్రభుత్వ సమయంలో పరిధిదాటి విమర్శలు చేశారు. ఆమె మాట్లాడిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 352, 353, ఐటీ యాక్ట్ 2000-2008 సెక్షన్ 66 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో శ్రీరెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.

తదుపరి వ్యాసం