తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /   Irctc Panch Devalayam Tour: పంచ దేవాలయం టూర్ ప్యాకేజీ... 5 ప్రముఖ ఆలయాలను చూడొచ్చు

IRCTC Panch Devalayam Tour: పంచ దేవాలయం టూర్ ప్యాకేజీ... 5 ప్రముఖ ఆలయాలను చూడొచ్చు

HT Telugu Desk HT Telugu

17 February 2023, 12:03 IST

    • Panch Devalayam Tour from Tirupati:శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. అంతేకాదు పంచ దేవాలయంలో ప్యాకేజీలో భాగంగా ప్రముఖ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ప్యాకేజీ వివరాలను ప్రకటించింది.
పంచ దేవాలయం టూర్
పంచ దేవాలయం టూర్ (facebook)

పంచ దేవాలయం టూర్

irctc tourism latest packages: ఏడుకొండలవాడి దర్శన భాగ్యం కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటారు. వారికోసం ఐఆర్‌సీటీసీ(IRCTC) టూరిజం ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. తిరుపతి నుంచి 'PANCH DEVALAYAM'పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

ఒక రాత్రి, 2 రోజుల ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి 25వ తేదీన అందుబాటులో ఉంది. తిరుమలతో పాటు కాణిపాకం(Kanipakam), శ్రీకాళహస్తి, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం వెళ్తారు. షెడ్యూల్ చూస్తే....

Day 01 - ఉదయం 7 గంటల తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద టూర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ్నుంచి హోటల్ లోకి చెకిన్ అవుతారు. ఫ్రెష్ అప్ తర్వాత... బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అనంతరం శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలను దర్శించుకుంటారు. మధ్యాహ్నం భోజన తర్వాత...శ్రీకాళహస్తీశ్వర గుడికి వెళ్తారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు.

Day 02 - బ్రేక్ ఫాస్ట్ తర్వాత... హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి ఆలయానికి వెళ్తారు. అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ / ఎయిర్ పోర్ట్ వద్ద దించుతారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ రేట్లు….

ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో టూర్ ప్యాకేజీ బుక్ చేయాల్సి ఉంటుంది. పంచ దేవాలయం టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు 16,230 గా ఉంటుంది. డబుల్ షేరింగ్ కు 9120, ట్రిపుల్ షేరింగ్ కు 7160గా నిర్ణయించారు. 4 -6 ప్యాసింజర్లు ఉండే క్లాస్ లో డబుల్ షేరింగ్ కు 5970గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. కింద ఇచ్చిన ప్యాకేజీలో ధరల వివరాలు చూడొచ్చు.

పంచ దేవాలయం టూర్ ధరలు