తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Upadtes: ఏపీలో నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 154 మండలాల్లో వడగాలులు, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్

AP Weather Upadtes: ఏపీలో నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 154 మండలాల్లో వడగాలులు, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్

Sarath chandra.B HT Telugu

25 April 2024, 6:30 IST

    • AP Weather Upadtes: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. 
ఏపీలో మండుతున్న ఎండలు
ఏపీలో మండుతున్న ఎండలు

ఏపీలో మండుతున్న ఎండలు

AP Weather Upadtes: ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు High Temparatures కొనసాగుతున్నాయి. బుధవారం విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45° డిగ్రీలు, వైయస్సార్ జిల్లా బలపనూరులో 44.9°డిగ్రీలు, ప్రకాశం జిల్లా దొనకొండలో 44.3°డిగ్రీలు, నంద్యాల జిల్లా మహానందిలో 44.2°డిగ్రీలు, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.1 డిగ్రీలు , ఎన్టీఆర్ జిల్లా కంభంపాడు, పల్నాడు జిల్లా రావిపాడులో 44° డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తలు నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 69 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 105 మండలాల్లో వడగాల్పులు heat waves వీచాయన్నారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Akhila Priya Bodyguard Attacked : అఖిల ప్రియ బాడీగార్డ్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-ఐదుగురిపై కేసు నమోదు

Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

గురువారం ఏపీలో 54 మండలాల్లో తీవ్రవడగాల్పులు Severe Heat Waves , 154 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 36 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 157 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

గురువారం తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు

గురువారం రాష్ట్రంలో 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

శ్రీకాకుళం 13 , విజయనగరం 23 , పార్వతీపురంమన్యం 12 , అల్లూరిసీతారామరాజు 2 అనకాపల్లి 3, విశాఖ పద్మనాభం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది.

154 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

వీటిలొ శ్రీకాకుళం15 , విజయనగరం 4, పార్వతీపురంమన్యం 3, అల్లూరిసీతారామరాజు 12, విశాఖపట్నం 3, అనకాపల్లి 15, కాకినాడ 17, కోనసీమ 9, తూర్పుగోదావరి 19, పశ్చిమగోదావరి 4, ఏలూరు 14, కృష్ణా 9, ఎన్టీఆర్ 5, గుంటూరు 14, పల్నాడు 5, బాపట్ల 1, ప్రకాశం 1, తిరుపతి 3, నెల్లూరు మనుబోలు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి.

చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ SDMA ఎండి కూర్మనాథ్ సూచించారు.

తదుపరి వ్యాసం