తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Iictc Tourism Latest Tour Package Of Shirdi From Tirupati City

IRCTC Shirdi Tour: అతి తక్కువ ధరలో షిర్డీ ట్రిప్.. కొత్త ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

HT Telugu Desk HT Telugu

09 March 2023, 16:46 IST

    • IRCTC Shirdi Tour Package From Tirupati: షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి షిరిడీకి సరికొత్త ప్యాకేజీ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ (www.irctctourism.com)

హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ

Shirdi Tour From Tirupati : ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి.. ఈ ప్యాకేజీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్‌సీటీసీ తీసుకెళ్లి.. తీసుకొస్తుంది. ఇందులో సేద తీరే ప్రాంతాలతో పాటు ప్రముఖ అధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉంటున్నాయి. తాజాగా తిరుపతి నుంచి షిర్డీకి ఓ ప్యాకేజీని ప్రకటించింది. “SAI SANNIDHI EX TIRUPATI” పేరుతో ఈ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ.

ట్రెండింగ్ వార్తలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. రైలు మార్గంలో షిరిడీకి వెళ్లాల్సి ఉంటుంది. శనిశిగ్నాపూర్ కూడా వెళ్లి రావొచ్చు. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండేలా ఐఆర్‌సీటీసీ ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఈ టూర్.. మార్చి 14, 2023వ తేదీన అందుబాటులో ఉంది. షెడ్యూల్ చూస్తే……

Day 01 : తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 08.30 నిమిషాలకు జర్నీ(train no. 17417) స్టార్ట్ అవుతుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది

Day 02 : ఉదయం 07.55 నిమిషాలకు నాగర్ సోల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... షిర్డీ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అనంతరం షిర్డీకి వస్తారు. హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. నాగర్ సోల్ కు చేరుకుని.. రాత్రి 09.30 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 10.10 నిమిషాలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day 03 : మూడో రోజు రాత్రి 10.10 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకోవటం టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ధరలు...

కంఫర్ట్ క్లాస్‌లో సింగిల్ అక్యూపెన్సీనికి 12,040 ఉండగా.. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8,380, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7240 చెల్లించాలి. ఇక స్టాండర్డ్ క్లాస్ లో అయితే సింగిల్ అక్యుపెన్సీకి రూ. 9210 ఉండగా.. ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 4410గా ఉంది. 5- 11 ఏళ్ల మధ్య ఉండే చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.

తిరుపతి - షిర్డీ ట్రిప్ ధరలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.