AP TET Free Coaching : ఏపీ టెట్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ - అర్హతలు, ముఖ్య తేదీలివే
06 July 2024, 6:01 IST
- AP TET Free Coaching 2024 : ఏపీ టెట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా టెట్ కోచింగ్ ఇచ్చేందుకు ప్రకటన విడుదల చేసింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఏపీ టెట్ ఫ్రీ కోచింగ్
AP TET Free Coaching 2024 : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మైనార్టీ సంక్షేమ శాఖ కలిపి ఉచిత కోచింగ్‌ను అందిస్తోన్నాయి. ఇందులో సీటు రావడానికి ఏపీ టెట్-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మైనార్టీ అభ్యర్థులు ఉచిత కోచింగ్ పొందేందుకు అర్హులు. దరఖాస్తు చేసునేందుకు జూలై 10 వరకు గడువు ఉంది.
ఇంటర్మీడియట్, డీఎడ్, డిగ్రీ, బీఎడ్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముస్లీం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైను, పార్సీ తదితర మైనార్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో లేదా డైరెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ దాఖలు చేయాలనుకునే అభ్యర్థులు https://www.apcedmmwd.org/ వెబ్‌సైల్‌లో చేసుకోవాలి.
డైరెక్టర్ కార్యాలయంలో చేయాలనుకునే అభ్యర్థులు డైరెక్టర్ కార్యాలయం మైనార్టీల విద్యాభివృద్ధి సెంటర్, స్వాతి థియేటర్ ఎదురుగా, భవానీపురం, విజయవాడ-520012 అడ్రస్ ను సందర్శించాలి. లేదా కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంలోని సంబంధిత రీజినల్ సెంటర్స్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు జూలై 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అదనపు సమాచారం కోసం 0866-2970567 ఫోన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు.
ఉచిత కోచింగ్ కోసం డిమాండ్…
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కూడా ప్రభుత్వం ఉచిత కోచింగ్ ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎస్టీ అభ్యర్థులకు టెట్, డీఎస్సీ ఉచిత కోచింగ్ కోసం కలెక్టర్లకు గిరిజన సంఘం వినతి పత్రాలు కూడా ఇచ్చింది. డీవైఎఫ్ఐ వంటి యువజన సంఘాలు రాష్ట్రంలోని టెట్ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ఉచిత కోచింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే టెట్ నోటిఫికేషన్ జూలై 1న విడుదల చేసింది. అలాగే అప్లికేషన్ దాఖల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 4న ప్రారంభమైన దరఖాస్తు దాఖలు ప్రక్రియ జూలై 17తో ముగుస్తుంది. జూలై 3 నుంచి జూలై 16 వరకు దరఖాస్తుకు సంబంధించిన ఫీజు చెల్లిచేందుకు అవకాశ ఉంది. టెట్ పరీక్షను ఆగస్టు నెలలో నిర్వహించే అవకాశం ఉంది. పరీక్ష విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది.