తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోరం, అనుమానంతో భార్యను గొంతు నులిమి హ‌త‌మార్చిన భ‌ర్త

Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోరం, అనుమానంతో భార్యను గొంతు నులిమి హ‌త‌మార్చిన భ‌ర్త

HT Telugu Desk HT Telugu

18 December 2024, 21:01 IST

google News
  • Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. భార్యపై అనుమానంలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడో భర్త. అనంతరం భార్య ఉరి వేసుకుని డ్రామా ఆడాడు. భార్య కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీయడంతో అసలు నిజం చెప్పాడు.

ఏలూరు జిల్లాలో ఘోరం, అనుమానంతో భార్యను గొంతు నులిమి హ‌త‌మార్చిన భ‌ర్త
ఏలూరు జిల్లాలో ఘోరం, అనుమానంతో భార్యను గొంతు నులిమి హ‌త‌మార్చిన భ‌ర్త

ఏలూరు జిల్లాలో ఘోరం, అనుమానంతో భార్యను గొంతు నులిమి హ‌త‌మార్చిన భ‌ర్త

Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోర‌ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను క‌ట్టుకున్న భ‌ర్తే గొంతు నులిమి హ‌త‌మార్చాడు. అయితే భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చిత్రీక‌రించేందుకు ప్రయ‌త్నించాడు. ఆమె కుటుంబ స‌భ్యులు నిల‌దీయ‌గా తానే గొంతు నులిమి హ‌త్య చేసిన‌ట్లు ఒప్పుకున్నాడు. మృతురాలి అన్నయ్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఈ దారుణమైన ఘ‌ట‌న ఏలూరు జిల్లా ఆగిరిప‌ల్లి మండ‌లంలోని స‌గ్గూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం ఆగిరిప‌ల్లి మండ‌లంలోని స‌గ్గూరుకి చెందిన లాము ర‌మేష్‌కి కృష్ణా జిల్లా ఉప్పులూరుకి చెందిన మ‌నీషా (27)తో వివాహం జ‌రిగింది. మ‌నీషాకు చాలా చిన్న వ‌య‌స్సులోనే వివాహం జ‌రిగింది. ప‌దేళ్ల క్రిత‌మే వీరిద్దరికి పెళ్లి జ‌రిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభ‌ర్తలు కూలి ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగించేవారు. భార్యపై అనుమానంతో త‌ర‌చూ గొడ‌వ‌లకు దిగేవాడు.

ఇదే విష‌య‌మై సోమ‌వారం రాత్రి వివాదం త‌లెత్తింది. దీంతో ఇద్దరూ ఘ‌ర్షణ‌కు దిగారు. తీవ్ర కోపోద్రికుడైన భ‌ర్త ర‌మేష్‌ ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఏమీ తెలియ‌న‌ట్టు మ‌నీషా ఉరి వేసుకుని చ‌నిపోయింద‌ని, ఆత్మహ‌త్యగా చిత్రీక‌రించేందుకు ప్రయ‌త్నించాడు. అనుమానం వ‌చ్చి మ‌నీషా కుటుంబ స‌భ్యులు గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో భార్యను గొంతు నులిమి హత్య చేసిన‌ట్లు ఒప్పుకున్నాడు. దీంతో మృతిరాలి అన్నయ్య ఏసుర‌త్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగ‌ళ‌వారం పోలీసులు కేసు న‌మోదు చేశారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేశామ‌ని, ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని ఆగిరిప‌ల్లి ఎస్ఐ శుభ‌శేఖ‌ర్ తెలిపారు. నిందితుడు అదుపులోకి తీసుకుని విచార‌ణ జ‌రుపుతున్నట్లు తెలిపారు.

మామ‌పై క‌త్తితో దాడి చేసిన అల్లుడు

భార్యను కొడుతున్నప్పుడు అడ్డొచ్చిన మామ‌పై అల్లుడు క‌త్తితో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న అంబేడ్కర్ కోన‌సీమ జిల్లా అయిన‌విల్లి మండ‌లం శాన‌ప‌ల్లిలంకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం శాన‌ప‌ల్లలంక‌ తూర్పు పేట‌కు చెందిన ముమ్మిడివ‌ర‌పు కృష్ణమూర్తికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఇటీవ‌ల మృతి చెందింది. కుమార్తెకు 15 ఏళ్ల క్రిత‌మే అమ‌లాపురం ఈద‌ర‌ప‌ల్లికి చెందిన క‌ల్లు ఏసుతో వివాహం జ‌రిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అల్లుడు మ‌ద్యానికి బానిసై కుమార్తెను త‌ర‌చూ కొడుతున్నాడు. అయితే ఇటీవ‌ల అల్లుడికి రోడ్డు ప్రమాదం జ‌రిగింది. అప్పటి నుంచి కుమార్తె, అల్లుడు కృష్ణ‌మూర్తి వ‌ద్దే ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం త‌న కుమార్తెను కొడుతుండ‌గా అడ్డు వ‌చ్చిన మామ‌పై క‌త్తితో దాడి చేశాడు. దీంతో కృష్ణ‌మూర్తి కుడి చేతికి గాయ‌మైంది. అమ‌లాపురం ఏరియా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. మామ కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరుకు అల్లుడిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు హెడ్ కానిస్టేబుల్ ఆర్‌. శ్రీను మంగ‌ళ‌వారం తెలిపారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని అన్నారు.

రిపోర్టర్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం