తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Train Collision 2023 : 'క్రికెట్ చూస్తూ రైలు నడపడంతోనే కంటకాపల్లి ప్రమాదం' - రైల్వే మంత్రి వైష్ణవ్ ప్రకటన

Andhra Train Collision 2023 : 'క్రికెట్ చూస్తూ రైలు నడపడంతోనే కంటకాపల్లి ప్రమాదం' - రైల్వే మంత్రి వైష్ణవ్ ప్రకటన

03 March 2024, 11:50 IST

google News
  • Andhra train collision 2023 Updates: గతేడాది విజయనగరం జిల్లాలో కంటకాపల్లి వద్ద చోటు చేసుకున్న రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. లోకో పైలట్‌, అసిస్టెంట్ లోకో పైలట్‌ సెల్‌ఫోన్‌లో క్రికెట్‌ చూస్తూ రైలు నడపడంతోనే ప్రమాదం జరిగిందన్నారు.

విజయనగరంలో చోటు చేసుకున్న రైళ్లు ప్రమాదం(ఫైల్ ఫొటో)
విజయనగరంలో చోటు చేసుకున్న రైళ్లు ప్రమాదం(ఫైల్ ఫొటో)

విజయనగరంలో చోటు చేసుకున్న రైళ్లు ప్రమాదం(ఫైల్ ఫొటో)

Andhra Train Collision 2023 Updates: గతేడాది అక్టోబరులో ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కంటకాపల్లి జంక్షన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందగా... పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.... రైలు నడపుతున్న డ్రైవర్ మరియు అసిస్టెంట్ డ్రైవర్ ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూడటమే కారణమని అని తెలిపారు.

2023 అక్టోబరు అక్టోబరు 29వ తేదీన విజయనగంలోని కంటకాపల్లి వద్ద హౌరా - చెన్నై లైన్ మార్గంలో ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తోన్న ప్రత్యేక ప్యాసింజర్ ట్రైన్ అలమండ-కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ పడకపోవడంతో పట్టాలపై నిలిచి ఉంది. ఆ సమయంలో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును వెనుక నుంచి విశాఖ-రాయగడ స్పెషల్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది చనిపోగా.... 50 మందికి గాయాలయ్యాయి.

శనివారం ఢిలీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్... భారతీయ రైల్వే శాఖ చేస్తున్న కొత్త భద్రతా చర్యల గురించి మాట్లాడుతూ ఈ రైలు ప్రమాదాన్ని ప్రస్తావించారు. ఏపీలో ఇటీవలే జరిగిన ప్రమాదంలో పైలట్, లోక్ పైలట్ నిర్లక్ష్యం ఉందన్నారు. ఇద్దరూ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండటంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూనే.... పైలట్లు మరియు అసిస్టెంట్ పైలట్‌లను నిర్ధారించగల వ్యవస్థలను ఇన్‌స్టాల్ చేస్తున్నామని చెప్పారు. రైలు నడపడంపై పూర్తిగా దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.

"రైల్వే ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టే కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాం. ప్రతి సంఘటనకు మూలకారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా పరిష్కారం మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్రమంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు.

ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పైలెట్, లోక్ పైలెట్ పై చర్యలు కూడా తీసుకుంది రైల్వే శాఖ.

తదుపరి వ్యాసం