తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Davos Tour | దావోస్ లో సీఎం ప్రసంగం.. ఏపీ వైద్య విధానం ప్రస్తావన

CM Jagan Davos Tour | దావోస్ లో సీఎం ప్రసంగం.. ఏపీ వైద్య విధానం ప్రస్తావన

HT Telugu Desk HT Telugu

23 May 2022, 19:53 IST

google News
    • సీఎం జగన్ దావోస్ పర్యటనలో ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బీజీబీజీగా ఉన్నారు. ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ పై జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
దావోస్ లో సీఎం జగన్
దావోస్ లో సీఎం జగన్

దావోస్ లో సీఎం జగన్

దావోస్ పర్యటనలో హెల్త్ సిస్టమ్స్ పై సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు. కొవిడ్‌ సమయంలో ఏపీ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌పై దృష్టి పెట్టిందని సీఎం జగన్ చెప్పారు. ఏపీలో అత్యాధునిక మల్టీస్పెషాలిటీ వైద్య సేవలు విషయంలో వెనకబడి ఉందని, నూతనంగా ఏర్పడిన రాష్ట్రం కావడం కారణంగా.. ఇలా ఉందని చెప్పారు.

బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి టయర్‌ -1 సిటీలు ఏపీలో లేవని.., ప్రైవేటు సెక్టార్‌లో అత్యాధునిక వైద్య సేవల లభ్యత తక్కువగా ఉందని చెప్పారు. ఇవన్నీ కొవిడ్ సమయంలో.. ముందుగానే గుర్తించామని జగన్ చెప్పారు. అందులో భాగంగానే.. కొవిడ్‌ నియంత్రణలో భాగంగా 44 దఫాలుగా ఇంటింటికీ సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు.

'ఆంధ్రప్రదేశ్‌లో 2వేల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి 30 వేల జనాభా ఉన్న మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 2 ప్రై మరీ హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాం. ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు చొప్పున నలుగురు వైద్యులు ఉంటారు. ప్రతి వైద్యుడికి 104 వాహనాన్ని కేటాయిస్తారు. ఒక్కో వైద్యుడికి మండలంలో 4–5 గ్రామాలను కేటాయిస్తారు. వీళ్లు రోజు తప్పించి రోజు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. ఆ గ్రామాల్లో ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లుగా సేవలు అందిస్తారు. ఆ గ్రామాల్లో ప్రజలను పేరు, పేరునా పలకరిస్తూ వారికి సేవలు అందించడంతో పాటు విలేజ్‌ క్లినిక్‌ను మెడికల్‌ హబ్‌గా ఉపయోగిస్తారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో పాటు 42 వేల మంది ఆశావర్కర్లు కూడా వైద్య, ఆరోగ్యరంగంలో పనిచేస్తున్నారు. ఇంటింటికీ సర్వే చేశారు.' అని సమావేశంలో జగన్ చెప్పారు.

ప్రతి పార్లమెంటును యూనిట్‌గా తీసుకుని మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపడుతున్నట్టుగా దావోస్ సమావేశంలో జగన్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు బోధనాసుపత్రుల సేవలు సమానంగా అందించాలే ప్లాన్ చేస్తున్నామన్నారు. మెడికల్‌ కాలేజీల ఏర్పాటు చేస్తేనే.. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌ వస్తారని పేర్కొన్నారు. మూడేళ్లలో రూ.16వేల కోట్ల సమీకరణ చేయాలని నిర్దేశించుకున్నామన్నారు.

తదుపరి వ్యాసం