తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Electric Buses In Tirupati : అలిపిరిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం జగన్

Electric Buses In Tirupati : అలిపిరిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం జగన్

HT Telugu Desk HT Telugu

27 September 2022, 20:02 IST

google News
    •  CM Jagan Inaugurates Electric Buses : శ్రీవారి పాదాల చెంత అలిపిరి వద్ద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమయ్యాయి. సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు.
ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం జగన్
ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం జగన్

ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం జగన్

అలిపిరి(Alipiri) వద్ద ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జగన్(CM Jagan) జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ హితాన్ని పాటించాలని 100 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సీఎం జగన్ అలిపిరి వద్ద 10 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఒక్కొక్క బస్సు 35 మంది ప్రయాణికులతో ఒకసారి ఛార్జ్ చేస్తే 180 కి.మీ ప్రయాణించగలదు.

ఎల్.ఈ.డి. డిస్ప్లే, సీసీటీవీ కెమెరాలు, వైఫై సౌకర్యం, జీపీఎస్ ట్రాకింగ్(GPS Tracking), లగేజ్ ర్యాక్స్ వంటి సౌకర్యాలు ఈ బస్సులో ఉంటాయి. అలిపిరి డిపోను పూర్తిగా విద్యుత్ బస్సులకు కేటాయిస్తూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అలాగే మదనపల్లి, కడప, నెల్లూరు బస్ స్టేషన్ల(Nellore Bus Station)లో కూడా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఏసీ కరెంట్ ఛార్జింగ్ 3 గంటల్లో, డీసీ ఛార్జింగ్ 1.30 గంటల్లో అవుతుంది. తిరుపతి-తిరుమల మధ్య 50, తిరుపతి-రేణిగుంట ఎయిర్పోర్ట్ 14, తిరుపతి-మదనపల్లి 12, తిరుపతి-కడప 12, తిరుపతి-నెల్లూరు 12 బస్సులను ఆర్టీసీ నడపనుంది.

ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీకి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ డెలివరీ చేసింది. గతేడాది నవంబర్లో, ఒలెక్ట్రా, ఈవీ ట్రాన్స్‌ ల కన్సార్షియానికికు ఏపీఎస్‌ఆర్‌టీసీ నుంచి విద్యుత్‌తో నడిచే 100 బస్సులు సరఫరా చేయడానికి ఆర్డర్‌ను లభించింది. ఈ 100 ఈ-బస్సులు 12 సంవత్సరాల పాటు GCC/OPEX మోడల్ ప్రాతిపదికన సరఫరా చేయడంతో పాటు నిర్వహిస్తాయి. మిగిలిన 90 విద్యుత్‌ బస్సు(Electric Buses)లను అతి త్వరలో ఒలెక్ట్రా డెలివరీ చేయనుంది. ఈ బస్సులను అలిపిరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ బస్సుల డిపో నుంచి నిర్వహిస్తారు. 50 బస్సులు తిరుమల-తిరుపతి ఘాట్‌(Tirupati Ghat)లో నడపనుండగా, మిగిలిన 50 బస్సులు నెల్లూరు, కడప, మదనపల్లెలకు ఇంటర్‌సిటీ బస్సులుగా నడుస్తాయి. కాంట్రాక్టు కాలంలో ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ బస్సుల నిర్వహణను కూడా చేపడుతుంది.

'బ్రహ్మోత్సవాల సందర్భంగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు సేవ చేయడం మాకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తున్నాం. తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డులో మా అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి. శేషాచల అడవులతో పాటు తిరుమల కొండల పర్యావరణాన్ని ఈ బస్సులు కాపాడతాయి. మా విద్యుత్‌ బస్సులు మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా విజయవంతమవుతాయని భావిస్తున్నాం.' ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ అన్నారు.

తదుపరి వ్యాసం