2వేల ఎలక్ట్రిక్​ బస్సుల కోసం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్​కు భారీ ఆర్డర్​..-olectra greentech bags biggest order worth rs 3 675 crores for 2 100 electric buses ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Olectra Greentech Bags Biggest Order Worth <Span Class='webrupee'>₹</span>3,675 Crores For 2,100 Electric Buses

2వేల ఎలక్ట్రిక్​ బస్సుల కోసం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్​కు భారీ ఆర్డర్​..

HT Telugu Desk HT Telugu
May 23, 2022 06:51 PM IST

Olectra Greentech | దేశంలో తొలిసారి ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టిన ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్​.. కంపెనీ చరిత్రలోనే భారీ ఆర్డర్​ను దక్కించుకుంది. బృహన్‌ముంబై ఎలక్ట్రిక్‌ సప్లయ్‌ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌ (బిఈఎస్‌టి- బెస్ట్) నుంచి 2,100 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం అతి భారీ అర్డర్‌ లభించింది. దీని విలువ రూ. 3675కోట్లు.

ఒలెక్ట్రా గ్రీన్​టెక్​కు భారీ ఆర్డర్​
ఒలెక్ట్రా గ్రీన్​టెక్​కు భారీ ఆర్డర్​ (HT Telugu)

Olectra Greentech | ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌కు బృహన్‌ముంబై ఎలక్ట్రిక్‌ సప్లయ్‌ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌ (బిఈఎస్‌టి- బెస్ట్) నుంచి 2,100 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం అతి భారీ అర్డర్‌ లభించింది. ఈ ఆర్డర్‌ విలువ రూ. 3675 కోట్లు.

ట్రెండింగ్ వార్తలు

ఎంఈఐఎల్‌ గ్రూపు కంపెనీ అయిన ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ మేరకు బెస్ట్‌ నుంచి లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ను పొందింది. ఈ నెల 7వ తేదీ స్టాక్స్ఛేంజీలకు ఇచ్చినట్టుగా, ఈవీ ట్రాన్స్‌ ఎల్‌1 బిడ్డర్‌గా నిలిచింది. దేశ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇదే అతి పెద్ద ఆర్డర్‌ కూడా కావడం విశేషం.

గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జీసీసీ) / ఒపెక్స్‌ ప్రాతిపదికన 2100 బస్సులను సప్లై చేసి వచ్చే 12ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఈవీ ట్రాన్స్‌ నేరుగా కానీ లేదా స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ)తో కానీ, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నుంచి బస్సులను కొనుగోలు చేస్తుంది. ఈ బస్సులను వచ్చే 12 నెలలలోగా సప్లై చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్‌ కాలంలో ఈ బస్సుల మెయింటెన్స్‌ బాధ్యతను కూడా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తీసుకుంటుంది.

ఈవీ ట్రాన్స్‌, ఒలెక్ట్రాల మధ్య జరిగే ఈ లావాదేవీని రిలేటెడ్‌ పార్టీ లావాదేవీగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌, కేవి ప్రదీప్‌ మాట్లాడుతూ, “బృహన్‌ముంబై ఎలక్ట్రిక్‌ సప్ల్‌య్‌ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌ (బెస్ట్) కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద ఆర్డర్‌ను పొందడం సంతోషంగా ఉంది. దేశ ఆర్థిక రాజధానిలో అతి పెద్ద ఎలక్ట్రిక్‌ బస్సులను నడపబోవడం చాలా గర్వంగా ఉంది. బస్సులను సకాలంలో షెడ్యూలు ప్రకారం డెలివరీ చేసి ముంబైవాసులకు సౌకర్యవంతమై ప్రయాణ అనుభవాలను అందిస్తాం,” అని అన్నారు.

దేశంలో తొలిసారి ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టిన ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ ఈ ఆర్డర్‌ కోసం 12 మీటర్ల ఎయిర్‌ కండీషన్డ్‌ బస్సులను తయారు చేయనుంది. ఇప్పటికే బెస్ట్‌ కోసం 40 బస్సులను ముంబైలో నిర్వహిస్తున్నది. ఈవీ, ఒలెక్ట్రాలు ఇప్పటికే వివిధ రాష్ట్రాల రవాణా సంస్థలకు బస్సులను సప్లై చేసింది. ప్రస్తుతం పూణె, హైదరాబాద్‌, గోవా, డెహ్రాడూన్, సూరత్‌, అహ్మదాబాద్‌, సిల్వాస, నాగ్‌పూర్‌లలో బస్సులను నిర్వహిస్తున్నది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్