తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Fro Recruitment 2024 : ఏపీపీఎస్సీ ఎఫ్ఆర్వో పోస్టుల భర్తీకి అప్లికేషన్లు ప్రారంభం, ముఖ్య తేదీలివే?

APPSC FRO Recruitment 2024 : ఏపీపీఎస్సీ ఎఫ్ఆర్వో పోస్టుల భర్తీకి అప్లికేషన్లు ప్రారంభం, ముఖ్య తేదీలివే?

17 April 2024, 15:15 IST

    • APPSC FRO Recruitment 2024 : ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్థులు మే 5 నాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ అటవీ శాఖలో 37 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ పోస్టుల భర్తీ
ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ పోస్టుల భర్తీ

ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ పోస్టుల భర్తీ

APPSC FRO Recruitment 2024 : ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (APPSC FRO Recruitment) పోస్టుల భర్తీకి ఇటీవల ఏపీపీఎస్సీ(APPSC) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 37 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 15 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. వచ్చే నెల 5 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ లో అప్లై (APPSC FRO Apply)చేసుకోవచ్చు. సంబంధిత సబ్జెట్ లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెల రూ.48,400 వేల నుంచి రూ.1,37,220 లక్షల వరకు వేతనం ఉంటుంది. రాతపరీక్షలు, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 01.07.2024 నాటికి 18 - 30 సంవత్సరాల వయస్సులోపు అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులు వయో పరిమితి సడలింపు ఉంటుంది.

ఏప్రిల్ 15 నుంచి- మే 5 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు

అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లను ఏప్రిల్ 15, 2024 నుంచి మే 5, 2024 రాత్రి 11:59 వరకు సమర్పించవచ్చు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల (AP FRO Recruitment 2024)కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో రిజిస్టర్డ్ OTPR నంబర్‌తో లాగిన్ అవ్వాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏపీపీఎస్సీ నోటిఫై చేసిన పోస్టుకి పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి. పెద్ద సంఖ్యలో(200 రెట్లు) అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే కమిషన్ స్క్రీనింగ్ పరీక్షను నిర్వహిస్తుంది. స్ర్కీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను మెయిన్స్ కు షార్ట్ లిస్ట్ చేస్తారు. మెయిన్స్ ను కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ తేదీలు విడిగా ప్రకటిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌ ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో కంప్యూటర్ సిస్టమ్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

జోన్ల వారీగా పోస్టులు(FRO Posts)

  • జోన్ -I : 08 ఖాళీలు
  • జోన్ -II : 11 ఖాళీలు
  • జోన్ -III : 10 ఖాళీలు
  • జోన్ -IV : 08 ఖాళీలు
  • పోస్టుల కేటాయింపు : ఓసీ-14, బీసీ-12, ఈడబ్ల్యూఎస్-11 పోస్టులు

How To Apply APPSC FRO : ఎలా దరఖాస్తు చేయాలి?

STEP I : అభ్యర్థి ముందుగా ఏపీపీఎస్సీ(APPSC) వెబ్‌సైట్‌ లో https://applications-psc.ap.gov.in/LoginNew.aspx రిజిస్టర్డ్ OTPR నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఒకవేళ అభ్యర్థి తొలిసారి ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాలి.

STEP-II : అభ్యర్థి తన ఓటీపీఆర్, పాస్ వర్డ్ తో ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత "Online Application" పై క్లిక్ చేయాలి. ఫారెస్ట్ రిజర్వ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తును పూర్తి చేయండి.

STEP-III : అభ్యర్థి పూర్తి వివరాలు నమోదు చేసుకుని, లోకల్/నాన్ లోకల్ స్టేటస్, వైట్ కార్డ్ వివరాలు పూరించాలి. ఆ తర్వాత అభ్యర్థి వివరాలు సరిచూసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

STEP-IV : అభ్యర్థులు అప్లికేషన్, పరీక్ష ఫీజు ఆన్ లైన్ మోడ్ లో చెల్లించాలి.

STEP-V: ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్‌లో సవరణలు ఏపీపీఎస్సీ అవకాశం కల్పిస్తుంది.

ఫీజు వివరాలు

అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాల్సిన అవసరంలేదు.

పరీక్ష విధానం ఇలా?

ఎఫ్ఆర్వో ప్రిలిమ్స్ (AP FRO Prelims)పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్-ఎ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, పార్ట్-బిలో జనరల్ ఫారెస్ట్రీ అంశాలు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

మెయిన్ పరీక్షను(AP FRO Mains) మొత్తం 600 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్స్ లో మొత్తం నాలుగు పేపర్లను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. వీటిల్లో ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ (జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు) ఉంటుంది. మెయిన్స్ లో నెగెటివ్ మార్కులు(1/3) ఉంటాయి. మెయిన్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 మార్కులు కనీస అర్హతగా నిర్ణయించారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం- ఏప్రిల్ 15
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది- మే 5
  • రాతపరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు

APPSC Website

తదుపరి వ్యాసం