APPSC Registrations: ఏపీపీఎస్సీలో అసిస్టెంట్ కెమిస్ట్‌, దివ్యాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం-registrations for assistant chemist and disabled welfare department jobs in appsc have started ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Registrations: ఏపీపీఎస్సీలో అసిస్టెంట్ కెమిస్ట్‌, దివ్యాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

APPSC Registrations: ఏపీపీఎస్సీలో అసిస్టెంట్ కెమిస్ట్‌, దివ్యాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Sarath chandra.B HT Telugu
Apr 01, 2024 01:36 PM IST

APPSC Registrations: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ఆధ్వర్యంలో గతంలో విడుదలైన అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 21 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేయవచ్చు.

ఏపీపీఎస్సీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఏపీపీఎస్సీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

APPSC Registrations: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ APPSC గత ఫిబ్రవరిలో విడుదల చేసిన భూగర్భ జలవనరుల శాఖ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ Asst Chemist పోస్టు భర్తీకి ఆన్‌లైన్‌ Online రిజిస్ట్రేషన్ Registration ప్రారంభమైంది. భూగర్భ జలవనరుల శాఖలో రూ.48,440-1,37,220 పే స్కేల్‌తో అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టును భర్తీ చేయనున్నారు. 18-42ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి 21వరకు స్వీకరిస్తారు. దరఖాస్తుదారులు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రాథమిక వివరాలతో ఓపీటిఆర్‌ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వన్‌టౌన్‌ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ నమోదు చేసుకున్న తర్వాత ఏపీపీఎస్స ఐడి నంబర్, మొబైల్‌, మెయిల్‌ ఐడీలకు వస్తాయి. ఓపీటిఆర్‌ తర్వాత అయా పోస్టులకు విడిగా నిర్ణీత ఫీజులు చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

గ్రౌండ్‌ వాటర్‌ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగానికి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ నిర్వహించే రాతపరీక్షలో షార్ట్‌ లిస్ట్‌ చేసిన వారిని కంప్యూటర్ సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అసిస్టెంటె కెమిస్ట్ ఉద్యోగం జనరల్ క్యాటగిరీలో ఉంది.

రాతపరీక్షను 450మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షిస్తారు. కెమిస్ట్రీ 1 పేపర్‌ 150, కెమిస్ట్రీ 2 పేపర్‌ 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌లో https://portal-psc.ap.gov.in/Default.aspx దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

దివ్యాంగుల సంక్షేమ శాఖలో....

దివ్యాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్ పోస్టుల భర్తీకి కూడా నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు. రూ.57,100 - 1,47,760 పే స్కేల్‌తో ఉన్న రెండు ఉద్యోగాలను రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఏప్రిల్ 1 నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రెండు పోస్టుల్లో ఒకటి క్యారీ ఫార్వార్డ్ కాగా మరొకటి కొత్త నియామకంగా పేర్కొన్నారు.

గ్రౌండ్ వాటర్‌ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్, వికలాంగుల సంక్షేమ శాఖలో ఏడీ పోస్టులకు పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

వికలాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సోషియాలజీ, సోషల్ సర్వీస్, సోషల్ వర్క్, సైకాలలలో పీజీ పూర్తి చేసి ఉండాలి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు కంప్యూటర్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు 18ఏళ్ల నుంచి 42ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 5ఏళ్ల సడలింపు ఇస్తారు. దివ్యాంగులకు పదేళ్ల పరిమితినిస్తారు.

ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.250ఫీజును రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. రిజర్వేషన్ క్యాటగిరీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తారు. పరీక్ష ఫీజు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజుల్ని ఆన్‌లైన్‌లో మాత్రమే నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో చెల్లించాల్సి ఉంటుంది. ఇతర పద్ధతుల్లో చేసే చెల్లింపుల్ని అనుమతించమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం