AP Govt Jobs 2024 : ఏపీ సీఆర్‌డీఏలో ఉద్యోగాలు - నెలకు రూ. 50 వేల జీతం, నోటిఫికేషన్ వివరాలివే
31 October 2024, 14:05 IST
- AP CRDA Recruitment 2024 : పలు ఉద్యోగాల భర్తీకి ఏపీసీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనుంది. . అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://crda.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఏపీసీఆర్డీఏలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(APCRDA) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా మొత్తం 19 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేస్తారు. ఏడాది కాలానికి పని చేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్/ బీఈ, ఎంఈ/ ఎంటెక్, పీజీలో ఉత్తీర్ణత ఉండాలి. దీనికితోడు పని చేసిన అనుభవం కూడా ఉండాలి. మొత్తం 19 పోస్టుల్లో ఎక్కువగా జీఐఎస్ రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ పోస్టులు ఆరు ఉన్నాయి. జూనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్పెషలిస్ట్ ఉద్యోగాలు నాలుగు ఉన్నాయి. ఇక ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులు రెండు, సీనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ ఉద్యోగం ఒకటి ఉంది. జూనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ మూడు, జెండర్/ జీబీవీ స్పెషలిస్ట్ ఒకటి ఉంది.
ఎంపికైన వారికి రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉంది. ఎంపికైన వారు విజయవాడ కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది. పోస్టును అనుసరించి మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు. https://crda.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే 9493974520 నెంబర్ ను సంప్రదించవచ్చు. లేదా recruitment@apcrda.org కు మెయిల్ కూడా చేయవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి APCRDA ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఏపీ రెవెన్యూ శాఖలో కొలువులు:
మరోవైపు ఏపీ రెవెన్యూ శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో 40 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలు చేసేందుకు నవంబర్ 4 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ 40 పోస్టులు భర్తీ చేసేందుకు ఆదేశించారు. అందులో ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు-13 కాగా, ఈ-డివిజనల్ మేనేజర్లు-27 ఉన్నాయి. కాంట్రాక్టు ప్రాతిపదికన కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్లకు ఆ పోస్టులను కేటాయించారు.
ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు, ఈ-డివిజనల్ మేనేజర్లు సంబంధిత జిల్లా కలెక్టర్ నియంత్రణలో, రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నియంత్రణలో ఉంటారు. ఈ-డిస్ట్రిక్ట్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అమలు కోసం, దానివల్ల ఉత్పన్నమయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం వీరు పని చేస్తారని పేర్కొంది.
అభ్యర్థులు దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ https://visakhapatnam.ap.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలు కూడా అందులో ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించిన తరువాత, దరఖాస్తుదారు దాని ప్రింటెండ్ కాఫీతో పాటు సంబంధిత విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలి.