తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Teachers Transfer : ఏపీలో టీచర్ల ప‌దోన్నత‌లు, బ‌దిలీల‌పై రోడ్డు మ్యాప్‌, త్వర‌లోనే ప్రక్రియ ప్రారంభం!

AP Teachers Transfer : ఏపీలో టీచర్ల ప‌దోన్నత‌లు, బ‌దిలీల‌పై రోడ్డు మ్యాప్‌, త్వర‌లోనే ప్రక్రియ ప్రారంభం!

HT Telugu Desk HT Telugu

01 December 2024, 22:00 IST

google News
  • AP Teachers Transfer : ఏపీలో టీచర్ల పదోన్నతలు,బదిలీలపై కసరత్తు జరుగుతోంది. డిసెంబ‌ర్ 20, జ‌న‌వ‌రి 25, ఫిబ్రవ‌రి 10 తేదీల్లో మూడు ద‌శ‌ల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్‌డేష‌న్ చేయ‌నున్నట్లు తెలిపారు. ఫిబ్రవ‌రి 15, మార్చి 1, మ‌ర్చి 15న మూడు ద‌శ‌ల్లో సీనియారిటీ జాబితాల‌ను విడ‌ద‌ల చేయ‌నున్నారు.

ఏపీలో టీచర్ల ప‌దోన్నత‌లు, బ‌దిలీల‌పై రోడ్డు మ్యాప్‌, త్వర‌లోనే ప్రక్రియ ప్రారంభం!
ఏపీలో టీచర్ల ప‌దోన్నత‌లు, బ‌దిలీల‌పై రోడ్డు మ్యాప్‌, త్వర‌లోనే ప్రక్రియ ప్రారంభం!

ఏపీలో టీచర్ల ప‌దోన్నత‌లు, బ‌దిలీల‌పై రోడ్డు మ్యాప్‌, త్వర‌లోనే ప్రక్రియ ప్రారంభం!

ఏపీ ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌ని చేసే ఉపాధ్యాయుల ప‌దోన్నత‌లు, బ‌దిలీల‌పై రోడ్డు మ్యాప్ త‌యారు అయింది. త్వర‌లోనే ఉపాధ్యాయుల ప‌దోన్నత‌లు, బ‌దిలీల‌పై ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అ మేరకు రాష్ట్ర పాఠ‌శాల విద్యా శాఖ‌లో క‌స‌ర‌త్తు జ‌రుగుతుంది. కొత్త సంవ‌త్సరంలో ఉపాధ్యాయుల ప‌దోన్నత‌లు, బ‌దిలీల జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 20, జ‌న‌వ‌రి 25, ఫిబ్రవ‌రి 10 తేదీల్లో మూడు ద‌శ‌ల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్‌డేష‌న్ చేయ‌నున్నట్లు తెలిపారు. ఫిబ్రవ‌రి 15, మార్చి 1, మ‌ర్చి 15న మూడు ద‌శ‌ల్లో సీనియారిటీ జాబితాల‌ను విడ‌ద‌ల చేయ‌నున్నారు.

ఏప్రిల్ 10 నుంచి 15 వ‌ర‌కు ప్రధానోపాధ్యాయుల బ‌దిలీలు, ఏప్రిల్ 21 నుంచి 25 వ‌ర‌కు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల బ‌దిలీలు, మే 1 నుంచి 10 వ‌ర‌కు ఎస్‌జీటీలు బ‌దిలీలు చేప‌ట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 16 నుంచి 20 వ‌ర‌కు ప్రధానోపాధ్యాయుల ప‌దోన్నతలు, మే 26 నుంచి 30 వ‌ర‌కు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల ప‌దోన్నత‌లు చేప‌ట్టనున్నట్లు స‌మాచారం.

గ‌త ప్రభుత్వంలో ఉపాధ్యాయ బ‌దిలీల‌ను ర‌ద్దు చేసిన ప్రభుత్వం

గ‌త ప్రభుత్వంలో ఎన్నిక‌లకు ముందు హ‌డావుడిగా ఉపాధ్యాయుల సిఫార్సు (అక్రమ‌) బ‌దిలీలు చేసింది. దాదాపు 917 మంది ఉపాధ్యాయులు ఈ ర‌కంగా త‌మ‌కు న‌చ్చిన‌ ప్రాంతానికి మంత్రులు, అధికారులు సిఫార్సుల‌తో బ‌దిలీలు అయ్యార‌ని ఆరోప‌ణ‌న‌లు ఉన్నాయి. దీనిపై అప్పుడు యూటీఎఫ్‌, ఎస్‌టీయూతో స‌హా ఉపాధ్యాయ సంఘాల‌న్నీ ఆందోళ‌న‌లు కూడా చేశారు. ఈ బ‌దిలీల‌ను వెంట‌నే ఆపాల‌ని డిమాండ్ చేశాయి. అయితే ఎన్నిక‌ల ముందు బ‌దిలీలు చేస్తూ ఆదేశాలు ఇచ్చిన‌ప్పటికీ, ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి రావ‌డంతో వారిని రిలీవ్ చేయ‌లేదు. అయితే వివిధ ద‌శ‌ల్లో చేసిన టీచ‌ర్ల బ‌దిలీల్లో 653 మందికి సంబంధించిన ఫైల్‌ను గత ప్రభుత్వంలో రాటిఫికేష‌న్ చేశారు. అలాగే 917 ఉపాధ్యాయుల బ‌దిలీకి సంబంధించిన ఫైల్‌ను గ‌త రాటిఫికేష‌న్ చేయ‌లేదు.

అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ అక్రమ బ‌దిలీల‌పై స్పందించారు. ఉపాధ్యాయుల బ‌దిలీల్లో జ‌వాబుదారీత‌నం, పార‌ద‌ర్శక‌త ఉంటుంద‌ని పేర్కొన్నారు. అలాగే టీచ‌ర్ల అక్రమ బ‌దిలీల‌ను ర‌ద్దు చేస్తామ‌ని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన రాటిఫికేష‌న్ ఫైల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తిర‌స్కరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నిక‌లకు ముందు హ‌డావుడిగా చేసిన ఉపాధ్యాయ బ‌దిలీలను ర‌ద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

దీంతో 215 మంది ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. త‌మ‌ను బ‌దిలీ చేస్తూ ఆదేశాలు వ‌చ్చిన‌ప్పటికీ, విధుల నుంచి రిలీవ్ చేయ‌లేద‌ని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో గ‌త వైసీపీ ప్రభుత్వం చేసిన బ‌దిలీలకు సంబంధించిన రాటిఫికేష‌న్ ఫైల్‌ను సీఎం చంద్రబాబుకు రాష్ట్ర పాఠ‌శాల విద్యాశాఖ పంపింది. ఈ ఫైల్‌ను ప‌రిశీలించిన సీఎం చంద్రబాబు తిర‌స్కరించారు. దీంతో 917 మంది ఉపాధ్యాయుల బ‌దిలీ ఆగిపోయింది. 2024 ఫిబ్రవ‌రి నుంచి జూన్ వ‌ర‌కు జ‌రిగిన అన్ని ఉపాధ్యాయుల బ‌దిలీల‌ను ర‌ద్దు చేస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం