AP 10th Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాలపై అప్డేట్, ఏప్రిల్ చివరి వారంలో రిజల్ట్స్ విడుదల?
15 April 2024, 20:49 IST
- AP 10th Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాల విడుదలపై అధికారులు ప్రాథమికంగా స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల ఉంటుందని అంటున్నారు.
ఏపీ పదో తరగతి ఫలితాలు
AP 10th Results 2024 Date : ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP SSC Results 2024) వచ్చేస్తున్నాయ్. ఏప్రిల్ 8వ తేదీనే జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను ముగించారు విద్యాశాఖ అధికారులు. అయితే ఫలితాల ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. ఫలితాల ప్రకటన తర్వాత గందరగోళం నెలకొనకుండా..మరోసారి జవాబు పత్రాలు పరిశీలన చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఒకటి రెండు రోజుల్లో ఫలితాల ప్రకటన తేదీపై స్పష్టం రానుంది అధికారులు అంటున్నారు. ఏపీ పదో తరగతి ఫలితాలు ఈ నెల చివరి వారంలో అంటే ఏప్రిల్ 25 నుంచి 30లోపు(AP 10th Results Date and Time) ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు నేరుగా ఎస్.ఎస్.సి బోర్డులో ఫలితాలు చెక్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది మే 6న పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈసారి కాస్త ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
AP SSC Results 2024 Date : ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు?
ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు (AP 10th Exams)జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 6.30 లక్షలకు పైగా విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల అనంతరం మూల్యాంకనం చేపట్టిన అధికారులు.. ఏప్రిల్ 8 నాటికి ప్రక్రియ పూర్తి చేశారు. అయితే జవాబు పత్రాలు మరోసారి పరిశీలించి, మార్కులు కంప్యూటీకరణ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు ఓ వారం పడుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా.. ఫలితాల విడుదలకు ఈసీ అనుమతి తప్పనిసరి. ఈసీ అనుమతి తొందరగా వస్తే ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు(AP 10th Results Date) విడుదల చేస్తారు. ఒకవేళ ఈసీ అనుమతి కాస్త ఆలస్యం అయితే మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని పరీక్షల విభాగం అధికారులు అంటున్నారు.
ఏపీ ఎస్.ఎస్.సి బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.ap.gov.in/ లో విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ తో ఫలితాలు చెక్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు పదో తరగతి మార్కుల మెమోను విద్యార్థులు చెక్ చేసి, డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
How To Download AP 10th Results 2024 : ఏపీ పదో ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు?
- విద్యార్థులు ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే "AP SSC Results 2024" లింక్‌పై క్లిక్ చేయాలి.
- విద్యార్థి హాల్ టికెట్ నంబర్ ను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- విద్యార్థి ఫలితాలు, మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
- మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ ను పొందవచ్చు.
హెచ్.టి.తెలుగులో టెన్త్ ఫలితాలు(AP SSC Results)
ఏపీ పదో తరగతి ఫలితాలను ఎస్ఎస్సీ బోర్డుతో పాటు పలు మీడియా, ఇతర వెబ్ సైట్ లలో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ లో కూడా విద్యార్థులు పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.