AP POLYCET 2024 : ఏపీ పాలిసెట్ కు ప్రిపేర్ అవుతున్నారా..? ఉచితంగా స్టడీ మెటీరియల్, సింపుల్ గా ఇలా డౌన్లోడ్ చేసుకోండి
07 April 2024, 9:04 IST
- AP POLYCET Study Material 2024: ఏపీ పాలిసెట్ 2024 స్టడీ మెటీరియల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ సాంకేతిక విద్యాశాఖ. ఈ మెటీరియల్ ను ఎలా పొందాలో ఇక్కడ చూడండి….
ఏపీ పాలిసెట్ - 2024
AP POLYCET Study Material 2024: ఏపీ పాలిసెట్(AP POLYCET) కు ప్రిపేర్ అవుతున్నారా..? ఫ్రీగా స్టడీ మెటిరీయల్ పొందాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సాంకేతిక విద్యాశాఖ. విద్యార్థులకు ఉచితంగా ఫ్రీ స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఈ స్టడీ మెటీరియల్ (AP POLYCET Study Material 2024)కాపీని పొందవచ్చు. అయితే పాలిసెట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్తులు… ఈ మెటిరీయల్ ను ఎలా పొందాలో ఇక్కడ చూడండి…
AP POLYCET Study Material 2024 Download - ఇలా డౌన్లోడ్ చేసుకోండి…
- ఏపీ పాలిసెట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉచితంగా స్టడీ మెటరీయల్ పొందాలంటే ముందుగా https://polycetap.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో … AP POLYCET Study Material - 2024 ఆప్షన్ కనిపిస్తుంది.
- ఇందులోనే తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఏ మీడియం మెటీరియల్ కావాలనుకుంటే… ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
- మీకు పీడీఎఫ్ రూపంలో మెటీరియల్ డౌన్లోడ్ అవుతుంది.దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు.
పాలిసెట్ దరఖాస్తుల గడువు పెంపు
ఏపీ పాలిసెట్(Andhra Pradesh Polytechnic Common Entrance Test 2024) ఆన్ లైన్ దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…ఏప్రిల్ 5 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కావాలి. అయితే ఈ గడువును మరో ఐదురోజుల పాటు పొడిగించారు. ఫలితంగా ఏప్రిల్ 10వ తేదీ వరకు విద్యార్థులు… ఏపీ పాలిసెట్ కు(AP POLYCET 2024) అప్లయ్ చేసుకునే వీలు ఉంటుంది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా… ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించనున్నారు. https://polycetap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు.
ఇలా దరఖాస్తు చేసుకోండి…
- ఏపీ పాలిసెట్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు https://polycetap.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- AP POLYCET 2024 registration link పై క్లిక్ చేయాలి.
- ముందుగా దరఖాస్తు రుసుం ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాతే… అప్లికేషన్ ప్రాసెస్ ముందుకు వెళ్తోంది.
- మీ ఫొటో, సంతకాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. తప్పులు దొర్లకుండా సరైన వివరాలను ఎంట్రీ చేయాలి.
- చివరగా సబ్మిట్ బటన్ నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
- రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దరఖాస్తు పూర్తి చేసిన ఫారమ్ ను ప్రింట్ పొందవచ్చు.
- దరఖాస్తు రుసుం - ఓబీసీలకు రూ. 400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 100
- ఏపీ పాలిసెట్ దరఖాస్తులు ప్రారంభం - 20, ఫిబ్రవరి 2024.
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - 10, ఏప్రిల్, 2024.
- పాలిసెట్ పరీక్ష తేదీ - 27, ఏప్రిల్, 2024.
- వెబ్ సైట్ - https://polycetap.nic.in/