తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Employees Donation : వరద బాధితులకు ఏపీ ఉద్యోగుల భారీ విరాళం - రూ. 120 కోట్లు ప్రకటన

AP Employees Donation : వరద బాధితులకు ఏపీ ఉద్యోగుల భారీ విరాళం - రూ. 120 కోట్లు ప్రకటన

04 September 2024, 18:48 IST

google News
    • వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ఎన్జీవో జేఏసీ భారీ విరాళం ప్రకటించింది. సెప్టెంబర్‌ నెల జీతంలో ఒక రోజు బేసిక్‌ పే ద్వారా రూ.120 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు వెల్లడించింది.  ఈ మేరకు సంఘ నేతలు… తమ అంగీకార పత్రాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు. 
రూ.120 కోట్లు విరాళం ప్రకటించిన ఉద్యోగులు
రూ.120 కోట్లు విరాళం ప్రకటించిన ఉద్యోగులు

రూ.120 కోట్లు విరాళం ప్రకటించిన ఉద్యోగులు

వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ఎన్జీవో జేఏసీ భారీ విరాళం ప్రకటించింది. ఈ నెల జీతంలో ఒక రోజు బేసిక్‌ పే ద్వారా రూ.120 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చింది.  ఈ మేరకు తమ అంగీకార పత్రాన్ని సీఎం చంద్రబాబుకు అందజేసింది. 

ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఏపీ వరద బాధితులకు సాయాన్ని ప్రకటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కూడా పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు స్పందించిన అనేకమంది విరాళాలిచ్చేందుకు ముందుకొస్తున్నారు.

దాతలు విరాళాలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బ్యాంకు ఖాతా నెంబర్ ను, అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా ఎవరైనా సహాయం అందించి వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలవచ్చని తెలిపింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

బ్యాంకు ఖాతా వివరాలు:

SBI

A/c name : CMRF

A/c number : 38588079208

Branch: AP Secretariat, Velagapudi.

IFSC code : SBIN0018884

Union Bank of India

A/c name : CM Relief Fund

A/c number : 110310100029039

Branch: AP Secretariat, Velagapudi.

IFSC code : UBIN0830798.

 ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకొని విరాళాలు అందించినందుకు దాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. మరోవైపు ఇవాళ మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… వరద బాధితులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. మంగళవారం కోటి రూపాయ విరాళం ప్రకటించిన ఆయన… ఇవాళ గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా రూ. 4 కోట్ల విరాళం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 400 గ్రామ పంచాయతీలకు లక్ష చొప్పున రూ. 4 కోట్ల విరాళం అందజేస్తాని చెప్పారు. 

తెలంగాణలోనూ విరాళం:

ఇటీవలే  తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితులకు సహాయంగా ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్యోగుల జేఏసీ రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది. ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వీ.లచ్చిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. రూ.100 కోట్ల విరాళాలు ప్రభుత్వానికి అందజేయనున్నట్టు లచ్చిరెడ్డి వెల్లడించారు. ఈ నిధులతో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

తదుపరి వ్యాసం