తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Supply Results 2024 : ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!

AP Inter Supply Results 2024 : ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!

26 June 2024, 17:04 IST

google News
    • AP Inter Supply Results 2024 : ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లో ఫలితాలు విడుదల చేశారు.
ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Inter Supply Results 2024 : ఏపీ ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం సాయంత్రం 4.00 గంటలకు సచివాలయంలో విడుదల చేశారు. https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.

ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు 2024- ఇలా చెక్ చేసుకోండి?

  • Step 1: ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/Index.do పై క్లిక్ చేయండి.
  • Step 2: హోం పేజీలో ఇంటర్ "రిజల్ట్స్" లింక్ పై క్లిక్ చేయండి.
  • Step 3: ఫస్టియర్ జనరల్ లేదా వొకేషనల్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
  • Step 4: విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • Step 5: మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
  • Step 6: భవిష్యత్ అవసరాల కోసం ఫలితాలు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 01వ తేదీ వరకు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 861 పరీక్ష కేంద్రాల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 18న ప్రకటించారు. ఇంటర్ షార్ట్ మార్క్స్ మెమోలను జులై 1 నుంచి https://bieap.apcfss.in పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.

రీవెరిఫికేషన్ కు అవకాశం

అన్ని అంశాలను పరిశీలించి, ఆన్సర్ షీట్స్ మూల్యాంకనం చేసినట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. అయితే విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఫస్టియర్ విద్యార్థులు ఆన్సర్ స్క్రిప్ట్‌ల రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. జూన్ 28 నుంచి జులై 4 వరకు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోరింది. రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది 

మేలో నిర్వహించిన అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇంప్రూవ్మెంట్ కోసం జనరల్ లో 206829 మంది హాజరవ్వగా 79 శాతం మంది అంటే 163101 మంది ఇంప్రూవ్మెంట్ సాధించారు. వొకేషనల్ కేటగిరీలో 3991 మంది విద్యార్థులు హాజరవ్వగా 40 శాతం అంటే 1615 మంది ఇంప్రూవ్మెంట్ సాధించారు. జనరల్, వొకేషనల్ కేటగిరీల్లో మొత్తంగా 210820 మంది విద్యార్థులు హాజరవ్వగా 78 శాతంతో 164716 మంది ఇంప్రూవ్మెంట్ సాధించారు. నాన్-ఇంప్రూవ్మెంట్ కేటగిరిలో 146750 మంది హాజరవ్వగా 43 శాతంతో 63548 మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాలకు సంబంధించి ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలపై సందేహాలు ఉంటే రీవెరిఫికేషన్ అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.

తదుపరి వ్యాసం