AP Inter Supply Results 2024 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రీవెరిఫికేషన్ కు మరో అవకాశం-amaravati ap inter supplementary results 2024 released student check in apbie site ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Supply Results 2024 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రీవెరిఫికేషన్ కు మరో అవకాశం

AP Inter Supply Results 2024 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రీవెరిఫికేషన్ కు మరో అవకాశం

Bandaru Satyaprasad HT Telugu
Jun 18, 2024 03:55 PM IST

AP Inter Supplementary Results 2024 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ద్వితీయ సంవత్సర ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. ఇంటర్ బోర్డు ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ చెక్ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

AP Inter Supplementary Results 2024 : ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ 2024 సెకండియర్ ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం బోర్డు విడుదల చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. జూన్ 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డు విడుదల చేసింది. మే 24 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా 861 కేంద్రాల్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ ఏడాది దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2024 ఇలా చెక్ చేసుకోండి?

  • Step 1: ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/Index.do పై క్లిక్ చేయండి.
  • Step 2: హోమ్ పేజీలో ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
  • Step 3: సెకండియర్ జనరల్ లేదా వొకేషనల్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
  • Step 4: విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • Step 5: మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తాయి.
  • Step 6: భవిష్యత్ రిఫరెన్స్ కోసం ఫలితాలు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

సప్లిమెంటరీ ఫలితాలను డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచుతామని బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు జూన్ 30లోపు సంబంధిత కాలేజీల్లో పొందవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,27,190 మంది విద్యార్థులు హాజరు కాగా... 74,868 మంది ఉత్తీర్ణత సాధించారు. పాస్ పర్సెంజెట్ 59 శాతం ఉంది.

రీవెరిఫికేషన్

జవాబు పత్రాలు మూల్యాంకనానికి అన్ని అంశాలు పరిశీలించిన చేసినట్లు బోర్డు పేర్కొంది. ఇంకా ఎవరైనా అనుమానాలు ఉంటే రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆన్సర్ స్క్రిప్ట్‌ల రీవెరిఫికేషన్ కోసం జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు రుసుము ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 నిర్ణయించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 26న ప్రకటించనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం