AP Govt Security Bonds : రూ.3,000 కోట్ల అప్పునకు ఏపీ సర్కార్ ఇండెంట్, అక్టోబర్ 1న బాండ్ల వేలం
28 September 2024, 17:15 IST
- AP Govt Security Bonds : ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. మూడున్నర నెలల్లోనే ఏడుసార్లు రూ.20 వేల కోట్ల అప్పునకు ఇండెంట్ పెట్టింది. తాజాగా అక్టోబర్ 1న నిర్వహించే వేలంలో రూ.3,000 కోట్ల అప్పునకు ఏపీ ప్రభుత్వం ఆర్బీఐకు ఇండెంట్ పెట్టింది.
రూ.3,000 కోట్ల అప్పునకు ఏపీ సర్కార్ ఇండెంట్, అక్టోబర్ 1న బాండ్ల వేలం
AP Govt Security Bonds : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. అధికారంలోకి వచ్చిన మూడున్నర నెలల్లోనే ఏకంగా ఏడుసార్లు రూ.20,000 కోట్ల అప్పుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. అందులో భాగంగానే తాజాగా అక్టోబర్ 1న నిర్వహించే వేలంలో రూ.3,000 కోట్ల అప్పునకు ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది.
కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు, వాటిని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అందుకోసం భారీస్థాయిలో నిధులు అవసరం కానుంది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా అప్పు కోసం ఆస్తులను ఇండెంట్ పెడుతుంది. అందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను కూటమి ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఇప్పటివరకు ఆరుసార్లు 17,000 కోట్ల అప్పుకు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. తాజాగా అక్టోబర్ 1న నిర్వహించే సెక్యూరిటీస్ వేలంలో మరో రూ. 3,000 కోట్ల అప్పుకు ఇండెంట్ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ-కుబేర్) వేలం వేయనుంది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో ఆర్బీఐ వాటిని విక్రయిస్తుంది.
జూన్ 11న రూ.2,000 కోట్లు
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జూన్ 11న నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 2,000 కోట్ల (రూ.500 కోట్లు, రూ.500 కోట్లు, రూ.1,000 కోట్లు) అప్పుకు రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.500 కోట్ల విలువ చేసే రెండు సెక్యూరిటీ బాండ్ల, రూ.1,000 కోట్ల విలువ చేసే ఒక సెక్యూరిటీ బాండ్ ఏపీ ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఈ బాండ్ల కాల పరిమితి నిర్ణయించింది. మొదటి రూ.500 కోట్ల బాండు 15 ఏళ్లు, రెండో రూ.500 కోట్ల బాండు 19 ఏళ్లు, రూ.1,000 కోట్ల బాండ్ 21 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది.
జూన్ 25న రూ. 2,000 కోట్లు
జూన్ 25న నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 2,000 కోట్ల (ఒక్కొక్కటి రూ.1,000 కోట్లు చొప్పున రెండు బాండ్లు) అప్పునకు రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే రెండు సెక్యూరిటీ బాండ్లను ఏపీ ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఈ బాండ్ల కాల పరిమితి నిర్ణయించింది. మొదటి రూ.1,000 కోట్ల బాండు 11 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 20 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది.
జులై 2న రూ.5,000 కోట్లు
జులై 2న నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 5,000 కోట్ల (ఒక్కొక్కటి రూ.1,000 కోట్లు చొప్పున ఐదు బాండ్లు) అప్పుకు రాష్ట్రంలోని టీడీజీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే ఐదు సెక్యూరిటీ బాండ్లను ఏపీ ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఈ బాండ్ల కాల పరిమితి నిర్ణయించింది. మొదటి రూ.1,000 కోట్ల బాండు 9 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 12 ఏళ్లు, మూడు రూ.1,000 కోట్ల బాండు17 ఏళ్లు, నాలుగో రూ.1,000 కోట్ల బాండు 21 ఏళ్లు, ఐదో రూ.1,000 కోట్ల బాండు 24 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది.
జులై 16న రూ. 2,000 కోట్లు
జులై 16న నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 2,000 కోట్ల (ఒక్కొక్కటి రూ.1,000 కోట్లు చొప్పున రెండు బాండ్లు) అప్పుకు రాష్ట్రంలోని టీడీజీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే రెండు సెక్యూరిటీ బాండ్లను ఏపీ ప్రభుత్వం వేలానికి పెట్టింది. మొదటి రూ.1,000 కోట్ల బాండు 16 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 19 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది.
జులై 30న రూ. 3,000 కోట్లు
జులై 30న నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 3,000 కోట్ల (ఒక్కొక్కటి రూ.1,000 కోట్లు చొప్పున మూడు బాండ్లు) అప్పుకు రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే మూడు సెక్యూరిటీ బాండ్లను ఏపీ ప్రభుత్వం వేలానికి పెట్టింది. మొదటి రూ.1,000 కోట్ల బాండు 15 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 20 ఏళ్లు, మూడో రూ.1,000 కోట్ల బాండు 25 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది.
ఆగస్టు 27న రూ. 3,000 కోట్లు
ఆగస్టు 27న నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 3,000 కోట్ల (ఒక్కొక్కటి రూ.1,000 కోట్లు చొప్పున మూడు బాండ్లు) అప్పుకు రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే మూడు సెక్యూరిటీ బాండ్లను ఏపీ ప్రభుత్వం వేలానికి పెట్టింది. మొదటి రూ.1,000 కోట్ల బాండు 12 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 17 ఏళ్లు, మూడో రూ.1,000 కోట్ల బాండు 22 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది.
తాజాగా అక్టోబర్ 1న రూ. 3,000 కోట్లు
తాజాగా అక్టోబర్ 1న నిర్వహించనున్న స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 3,000 కోట్ల (ఒక్కొక్కటి రూ.1,000 కోట్లు చొప్పున మూడు బాండ్లు) అప్పుకు రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే మూడు సెక్యూరిటీ బాండ్లను ఏపీ ప్రభుత్వం వేలానికి పెట్టింది. మొదటి రూ.1,000 కోట్ల బాండు 14 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 20 ఏళ్లు, మూడో రూ.1,000 కోట్ల బాండు 24 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది.
ఈ సెక్యూరిటీ బాండ్లను వ్యక్తులు, సంస్థలు కొనుగోలు చేయొచ్చని ఆర్బీఐ తెలిపింది. కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనుగోలు వారు ఈనెల 27 (మంగళవారం)న ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య కాంపిటేటివ్ (పోటీ) బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందని, అలాగే ఉదయం 10.30 గంటల నుంచి ఉదయం 11 గంటల మధ్య నాన్ కాంపిటేటివ్ (పోటీ లేని) బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.
జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు