తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Dgp Dwaraka Tirumalarao : వైసీపీ నేత సజ్జలపై లుకౌట్ నోటీసు, డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు

DGP Dwaraka Tirumalarao : వైసీపీ నేత సజ్జలపై లుకౌట్ నోటీసు, డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు

15 October 2024, 18:00 IST

google News
  • DGP Dwaraka Tirumalarao : వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డిపై లుకౌట్ నోటీసు ఉందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఒక కేసు విషయంలో గుంటూరు జిల్లా ఎస్పీ...సజ్జలకు లుకౌట్ నోటీసు జారీ చేశారన్నారు. ఈ కేసులో సజ్జలను చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.

 వైసీపీ నేత సజ్జలపై లుకౌట్ నోటీసు, డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు
వైసీపీ నేత సజ్జలపై లుకౌట్ నోటీసు, డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు

వైసీపీ నేత సజ్జలపై లుకౌట్ నోటీసు, డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర విచారణలో రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదని డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్వతంత్ర దర్యాప్తు బృందంలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసులు, ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి ఉంటారన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, డీఐజీ గోపీనాథ్ జెట్టి పేర్లను సూచించామన్నారు. టీడీపీ ఆఫీసు, చంద్రబాబు ఇంటిపై కేసులతో పాటు మరో రెండు కేసుల్ని సీఐడీకి బదిలీ చేశామని డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసు ఉందన్నారు. ఒక కేసు విషయంలో గుంటూరు జిల్లా ఎస్పీ లుకౌట్ నోటీస్ జారీ చేశారని పేర్కొ్న్నారు. ఆ కేసుకు సంబంధించి చట్టపరమైన తీసుకునే వీలుందన్నారు.

కేసులు సీఐడీకి బదిలీ

టీడీపీ ఆఫీసుపై దాడి కేసును ఏపీ సర్కార్ సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును సాంకేతిక కారణాల నేపథ్యంలో ఇంకా మంగళగిరి పోలీసులే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం ఆరోపణలు ఉన్నాయి. ఈ ముగ్గురు నేతలు సోమవారం కూడా మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరి నుంచి పలు కీలక అంశాలపై సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన రోజు వీరంతా ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు. ఎక్కడక్కడా తిరిగారనే వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కీలక పరిణామం

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పానుగంటి చైతన్య సోమవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడైన పానుగంటి చైతన్య వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. 2021 అక్టోబర్‌లో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి చేసి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పార్టీ ఆఫీసులోని సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడికి పానుగంటి చైతన్య కీలకంగా వ్యవహరించాలని ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిన్న మంగళగిరి కోర్టులో లొంగిపోయారు.

'మదనపల్లి ఫైల్స్ దగ్దం కేసును సీఐడీ విచారిస్తోంది. ఈ కేసులో చాలా మంది అధికారులను సీఐడీ విచారించాల్సి ఉంది. 6-7 కేసులు దీనికి ఇంటర్ లింక్ అయ్యి ఉన్నాయి.' అని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నాయి.

తదుపరి వ్యాసం