తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan| పంట నష్టపోయిన రైతుల ఖాతాలో డబ్బు.. బటన్ నొక్కి జమ చేసిన సీఎం

CM Jagan| పంట నష్టపోయిన రైతుల ఖాతాలో డబ్బు.. బటన్ నొక్కి జమ చేసిన సీఎం

HT Telugu Desk HT Telugu

15 February 2022, 13:41 IST

google News
    • పంట నష్టపోయిన, అర్హులైన రైతుల ఖాతాలో ఇన్‌పుట్ సబ్సిడీని అందజేశారు సీఎం జగన్. బటన్ నొక్కి పరిహారాన్ని జమ చేశారు. దాదాపు రూ.571 కోట్లను విడుదల చేశారు.
సీఎం జగన్
సీఎం జగన్ (Feed)

సీఎం జగన్

వ్యవసాయంలో పంట నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని అందజేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా పంటను నష్టపోయిన రైతులకు సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేశారు. మొత్తం రూ.571 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని అందజేస్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.

గతేడాది నవంబరులో వర్షాలు, వరదలతో ఎంతోమంది రైతలు నష్టపోయారని, వారికి ఇన్ పుట్ సబ్సిడీ కింద సాయం అందజేస్తున్నామని తెలిపారు. 5 లక్షల 79వేల మందికి పైగా ఉన్న రైతులకు రూ.542 కోట్ల సబ్సిడీని ఇస్తున్నామని, 1220 రైతు గ్రూపులకు యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్ల లబ్ది చేకూరుస్తున్నామని స్పష్టం చేశారు. మొత్తంగా ఇవాళ రూ.571 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు.

<p>వైఎస్సార్ యంత్ర సేవ పథకం</p>

రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు గొప్ప కార్యక్రమం జరుగుతోందని, వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా అన్నదాతలను ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా, రైతులకు సున్నా వడ్డీ పథకం ద్వారా రెండున్నరేళ్ల కాలంలో అండగా నిలిచామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ సరిగ్గా ఇవ్వలేదని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిశాయని, సీమ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ బాగా పెరిగిందని అన్నారు.

 

తదుపరి వ్యాసం