తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Admissions 2024 : బీఎస్సీ అగ్రికల్చర్, హార్టిక‌ల్చ‌ర్‌ ప్ర‌వేశాల‌కు నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు తేదీలు, వివరాలివే

AP Admissions 2024 : బీఎస్సీ అగ్రికల్చర్, హార్టిక‌ల్చ‌ర్‌ ప్ర‌వేశాల‌కు నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు తేదీలు, వివరాలివే

HT Telugu Desk HT Telugu

12 July 2024, 19:07 IST

google News
    • AP AGRICET 2024 : ఆచార్య‌ ఎన్జీ రంగా యూనివ‌ర్శిటీలో బీఎస్సీ అగ్రిక‌ల్చ‌ర్‌ కోర్సుల కోసం అగ్రిక‌ల్చ‌ర‌ల్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (అగ్రిసెట్) నోటిఫికేష‌న్ విడుద‌లైంది.  అప్లికేషన్లకు జులై 31వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. హార్టిక‌ల్చ‌ర్‌ కోర్సు ప్ర‌వేశాల‌కు కూడా నోటిఫికేష‌న్ విడుదలైంది.
 అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల‌కు అగ్రిసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల
అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల‌కు అగ్రిసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల

అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల‌కు అగ్రిసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల

AP AGRICET 2024 Notification:  ఆచార్య ఎన్జీ రంగా అగ్రిక‌ల్చ‌ర్‌ యూనివ‌ర్శిటీ (ఏఎన్‌జీఆర్ఏయూ) నాలుగేళ్ల బీఎస్సీ (ఆన‌ర్స్‌) కోర్సుకు సంబంధించి 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి అడ్మిష‌న్ కోసం జులై 10న అగ్రిసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. జులై 15 నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్లు ప్రారంభం కాగదా….  చివ‌రి తేదీగా జులై 31ని నిర్ణ‌యించారు. 

అద‌న‌పు రుసుముతో ద‌ర‌ఖాస్తుకు చేసుకోవ‌డానికి ఆగ‌స్టు 1 నుంచి ఆగ‌స్టు 5 గ‌డువు ఇచ్చారు. అప్లికేష‌న్‌లో ఏదైనా మార్పు చేసుకోవాలంటే ఆగ‌స్టు 7 నుంచి 8 మ‌ధ్య ఎడిట్ ఆప్ష‌న్‌లో చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు హ‌ర్డ్ కాపీలు పంపాల్సి ఉంటుంది. హ‌ర్డ్ కాపీల‌ను పంపేందుకు ఆగ‌స్టు 14 వ‌ర‌కు గ‌డువు ఉంది.

ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసిన త‌రువాత హ‌ర్డ్ కాపీని ఆగ‌స్టు 14లోపు పంపాలి. అది కూడా రిజిస్ట్ర‌ర్ పోస్టు, లేదా స్పీడ్ పోస్టులో పంపాలి. ద‌ర‌ఖాస్తు హ‌ర్డ్ కాపీ పంపాల్సిన చిరునామా ఇది.“The Convener, AGRICET-2024, O/o The Associate Dean, SV Agricultural College, Tirupati -517 502, A.P.

హ‌ర్డ్‌కాపీతో ఉండాల్సిన ప‌త్రాలు

ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసిన అప్లికేష‌న్ హ‌ర్డ్ కాపీ, పుట్టిన తేదీ స‌ర్టిఫికేట్‌, ఎస్ఎస్‌సీ స‌ర్టిఫికేట్, డిప్లొమా మార్కుల జాబితా, కండ‌క్ట్ స‌ర్టిఫికేట్‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం. ఏడేళ్ల లోక్ స‌ర్టిఫికేట్ (స్ట‌డీ ఆర్ రెసిడెన్సీ), పీహెచ్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, సీఏపీ, ఒక పాస్‌పోర్టు సైజ్ పోటో, అప్లికేష‌న్ ఫీజు పేమెంట్ రిసిప్ట్‌లు జ‌త చేయాలి.

అగ్రిసెట్‌కు సంబంధించి ప‌రీక్షా విధానం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అగ్రిసెట్ పరీక్ష ఆగ‌స్టు 27న మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 4.00 గంట‌ల వ‌ర‌కు గంట‌న్న‌ర సేపు జ‌రుగుతుంది. అది కూడా ఇంగ్లీష్‌, తెలుగు మీడియాల్లో ప‌రీక్ష ఉంటుంది. 120 ప్ర‌శ్న‌లు ఉంటాయి. నెగిటివ్ మార్కులు ఉండ‌వు. 

ఆగ‌స్టు 16 నుంచి ఆగ‌స్టు 23 వ‌ర‌కు అగ్రిసెట్ హాల్‌టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అగ్రిసెట్ మాక్ టెస్టులు ఆగ‌స్టు 20 నుంచి ఆగ‌స్టు 25 వ‌ర‌కు జ‌రుగుతాయి. ఫ‌లితాలు వెల్ల‌డి, కౌన్సిలింగ్ తేదీల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని ఏఎన్‌జీఆర్ఏయూ తెలిపింది. ప‌రీక్ష కేంద్రాలు రాష్ట్రంలోని ఉమ్మ‌డి 13 జిల్లాల్లో ఉంటాయి.

రెండేళ్ల డిప్లొమా (అగ్రిక‌ల్చ‌ర్‌, సీడ్ టెక్నాల‌జీ, ఆర్గానిక్ ఫార్మింగ్ ) పూర్తి చేసిన వారు ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి అర్హులు. 2024 డిసెంబ‌ర్ 31 నాటికి 17 ఏళ్లు పూర్తి అవ్వాలి. అంద‌రూ 22 ఏళ్ల‌ వ‌ర‌కు అర్హులు. ఎస్సీ, ఎస్టీల‌కు 25 ఏళ్ల వ‌ర‌కు, దివ్యాంగుల‌కు 27 ఏళ్ల వ‌ర‌కు అర్హులు.

ఎన్ని సీట్లు… ?

రాష్ట్రంలో మొత్తం 268 సీట్లు ఉన్నాయి. అందులో యూనివ‌ర్శిటీ అగ్రిక‌ల్చ‌ర‌ల్ కాలేజీలో 196, అనుబంధ అగ్రిక‌ల్చ‌ర‌ల్‌ కాలేజీలో 72 సీట్లు ఉన్నాయి. ఇందులో అగ్రిక‌ల్చర‌ల్ కోర్సుకు 220 సీట్లు కాగా, అందులో 161 ప్ర‌భుత్వ, 59 అనుబంధ కాలేజీ సీట్లు ఉన్నాయి. సీడ్ టెక్నాల‌జీ కోర్సుకు 37 సీట్లు కాగా, అందులో 27 ప్ర‌భుత్వ, 03 అనుబంధ కాలేజీ సీట్లు ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్‌ కోర్సుకు 11 సీట్లు కాగా, అందులో 08 ప్ర‌భుత్వ, 03 అనుబంధ కాలేజీ సీట్లు ఉన్నాయి. అనుబంధ కాలేజీల్లో ఉన్న 72 సీట్ల‌లో 24 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద భ‌ర్తీ చేస్తారు. అంటే ఒక్కొ కాలేజీకి నాలుగు సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద భ‌ర్తీ చేస్తారు.

అప్లికేష‌న్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ.750 కాగా, ఓసీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.1,500 నిర్ణ‌యించారు. ఫీజును అధికారిక వెబ్‌సైట్ angrau.ac.in లో ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. అప్లికేష‌న్ దాఖ‌లకు గ‌డువు జులై 31న ముగిసిన త‌రువాత ఆగ‌స్టు 1 నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు అద‌న‌పు ఫీజుతో ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే జ‌న‌ర‌ల్ కేట‌గిరీ, బీసీ అభ్య‌ర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. 

మొత్తం సీట్ల‌లో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థుల‌కే కేటాయిస్తారు. 15 శాతం సీట్లు నాన్ లోకల్ విద్యార్థుల‌కు కేటాయిస్తారు. ఇత‌ర వివరాలు కావాలంటే అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://angrau.ac.in/downloads/Admissions/LE_BSC_Agri/3.AGRICET%202024%20Information%20brochure_Updated.pdf  సంప్ర‌దించవచ్చు.

హార్టిక‌ల్చ‌ర్‌ కోర్సు ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్

Dr.Y.S.R.Horticultural University : డాక్ట‌ర్ వైఎస్ఆర్ హార్టిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీలో బీఎస్సీ ఆనర్స్ హార్టిక‌ల్చ‌ర్‌ కోర్సు కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి నాలుగేళ్ల బీఎస్సీ (ఆన‌ర్స్‌) హార్టిక‌ల్చ‌ర్ కోర్సులో ప్ర‌వేశాల‌కు డాక్ట‌ర్ వైఎస్ఆర్ హార్టిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ (వైఎస్ఆర్‌హెచ్‌యూ) ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఆగ‌స్టు 9 వ‌ర‌కు గ‌డువు ఉంది.

మొత్తం ఐదు హార్టిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ కాలేజీలు కాగా, నాలుగు అనుబంధ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 541 సీట్ల‌కు గాను, 360 సాధార‌ణ సీట్లు కాగా, 13 పేమెంట్ సీట్లు, 168 కేట‌గిరీ ఏ సీట్లు ఉన్నాయి. అందులో ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరీ కింద కేటాయించాల్సిన 10 శాతం సూప‌ర్ న్యూమ‌రీ సీట్లు ఉన్నాయి. 

13 పేమెంట్ సీట్లు ఏపీఈఎపిసెట్-2024 ర్యాంక్ అభ్య‌ర్థుల‌కు రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న కేటాయిస్తారు. కాక‌పోతే ఈ సీట్ల‌కు ఫీజులు చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే 168 కేట‌గిరీ ఏ సీట్లు అనుబంధ కాలేజీలు భ‌ర్తీ చేస్తాయి. ఈ సీట్లు ఏపీఈఎపిసెట్-2024 ర్యాంక్ అభ్య‌ర్థుల‌కు రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న కేటాయిస్తారు. అయితే ఈ సీట్ల‌కు ఫీజులు సెప‌రేట్‌గా ఉంటాయి.

అర్హతలు…

రెండేళ్ల ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసిన వారు ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి అర్హులు. ఫిజిక‌ల్ సైన్స్‌, బ‌యోల‌జీ లేదా నేచుర‌ల్ సైన్స్ స‌బ్జిట్స్ ఉండాలి. వ‌యో ప‌రిమితి జ‌న‌ర‌ల్ కేట‌గిరీ వారికి 2024 డిసెంబ‌ర్ 31 నాటికి 17 ఏళ్లు పూర్తి అవ్వాలి. అంద‌రూ 22 ఏళ్ల‌ వ‌ర‌కు అర్హులు. అంటే 2003 జ‌న‌వ‌రి 1 నుంచి 2007 డిసెంబ‌ర్ 31 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 2024 డిసెంబ‌ర్ 31 నాటికి 17 ఏళ్లు పూర్తి అవ్వాలి. అంద‌రూ 25 ఏళ్ల‌ వ‌ర‌కు అర్హులు. అంటే 2000 జ‌న‌వ‌రి 1 నుంచి 2007 డిసెంబ‌ర్ 31 మధ్య పుట్టి ఉండాలి. దివ్యాంగుల‌కు 2024 డిసెంబ‌ర్ 31 నాటికి 17 ఏళ్లు పూర్తి అవ్వాలి. అంద‌రూ 27 ఏళ్ల‌ వ‌ర‌కు అర్హులు. అంటే 1998జ‌న‌వ‌రి 1 నుంచి 2007 డిసెంబ‌ర్ 31 మధ్య పుట్టి ఉండాలి.

వీరికి 40 శాతం రైతు కోటా….

వ్యవ‌సాయ, గ్రామీణ ప్రాంత కుటుంబాల నుంచి వ‌చ్చిన అభ్య‌ర్థుల‌కు రైతు కోటా ఉంటుంది. 40 శాతం సీట్లు వ్యవ‌సాయ కుటుంబాల‌కే కేటాయించారు. అభ్య‌ర్థి క‌నీసం నాలుగేళ్లు నాన్ మున్సిప‌ల్ ప్రాంతం (గ్రామీణ‌)లో చ‌ద‌వి ఉండాలి. ఒక ఎక‌రా కంటే త‌క్కువ భూమి ఉన్న అభ్య‌ర్థులు అర్హులు కాదు. అభ్య‌ర్థి, త‌ల్లిదండ్రుల పేరు మీద భూమి ఉండాలి. తాత‌, నాన్న‌మ్మ‌, గార్డియ‌న్‌, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఎవ‌రి పేరు మీద భూమి ఉన్న అర్హులు కాదు.

ఓపెన్ కేట‌గిరిలో 41 శాతం సీట్లు ఉన్నాయి. ఎస్‌సీ కేట‌గిరిలో 15 శాతం సీట్లు, ఎస్‌టీ కేట‌గిరిలో 6 శాతం సీట్లు ఉన్నాయి. బీసీ కేట‌గిరిలో 29 శాతం సీట్లు ఉన్నాయి. అందులో బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 శాతం సీట్లు ఉన్నాయి. అలాగే విక‌లాంగు (పీహెచ్) కేట‌గిరిలో 5 శాతం సీట్లు ఉన్నాయి. సైనిక సిబ్బంది పిల్ల‌ల కేట‌గిరిలో 2 శాతం, ఎస్‌సీసీ కేట‌గిరిలో 1 శాతం, స్పోర్ట్స్ కేట‌గిరీకి 0.5 శాతం, స్కౌట్స్‌, గైడ్స్ కేట‌గిరీలో 0.5 శాతం సీట్లు ఉన్నాయి. విద్యార్థినీల‌కు 33.33 శాతం రిజ‌ర్వేష‌న్ కేటాయించారు. ఈడ‌బ్ల్యుఎస్ కేట‌గిరీ కింద 10 శాతం సీట్లు కేటాయించారు.

బీఎస్సీ ఆన‌ర్స్ హార్టిక‌ల్చ‌ర్ కోర్సుకు ఏపీ ఈఏపిసెట్-2024 ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 85 శాతం లోకల్ సీట్లు కాగా, అందులో ఆంధ్రాయూనివ‌ర్శిటీ, శ్రీ వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్శిటీ ప్రాంత అభ్య‌ర్థుల‌కు 42ః22 నిష్ప‌త్తిలో కేటాయిస్తారు. 15 శాతం సీట్లు అన్ రిజర్వ‌డ్‌, ఏయూ, ఎస్‌వీయుతోపాటు ఏపీఈఏపీసెట్‌-2024 ర్యాంకు సాధించిన ఉస్మానియా యూనివ‌ర్శిటీ అభ్య‌ర్థులు కూడా సీట్ల‌కు పోటీ ప‌డొచ్చు.

దరఖాస్తును ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://apysrhu-ugadmissions.aptonline.in/UGYSRHU/register  పై క్లిక్ చేసి దరఖాస్తు చేయొచ్చు.

అప్లికేష‌న్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ.500 కాగా, ఓసీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.1,000 నిర్ణ‌యించారు. ఫీజును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://apysrhu-ugadmissions.aptonline.in/UGYSRHU/printBipcPayment  లో ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. అప్లికేష‌న్ దాఖ‌లకు గ‌డువు ఆగ‌స్టు 9న ముగిసిన త‌రువాత మ‌రో మూడు రోజులు అద‌న‌పు ఫీజుతో ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే జ‌న‌ర‌ల్ కేట‌గిరీ, బీసీ అభ్య‌ర్థులు రూ.2,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.

ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

అడ్మిష‌న్ స‌మ‌యంలో ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్లు తీసుకుపోవాలి. ఇంట‌ర్మీడియ‌ట్‌ మార్కుల జాబితా, ఏపీఈఏపీసెట్‌-2024 హాల్ టికెట్టు, ర్యాంక్ కార్డు. ప‌దో త‌ర‌గ‌తి లేదా ప‌దో ఎస్ఎస్‌సీకి స‌మాన ప‌రీక్ష స‌ర్టిఫికేట్‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, ఆరో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్మీడియ‌ట్‌ వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికేట్‌, రెసిడెన్స్ స‌ర్టిఫికేట్‌, టీసీ, ఫార్మ‌ర్ కోటా కింద చేరే విద్యార్థులైతే రూర‌ల్ ఏరియా విద్యార్థులు నాన్ మున్సిప‌ల్ ఏరియా స్ట‌డీ స‌ర్టిఫికేట్, భూమికి సంబంధించిన అడంగ‌ల్‌, 1 బీ అద‌న‌పు స‌ర్టిఫికేట్లు తీసుకురావాలి. విక‌లాంగు విద్యార్థులైతే పిహెచ్ స‌ర్టిఫికేట్‌, డిఫెన్స్ పిల్ల‌లైతే ఐడీ కార్డు, ఎన్‌సీసీ అభ్య‌ర్థులైతే ఎన్‌సీసీ స‌ర్టిఫికేట్‌, స్పోర్ట్ అభ్య‌ర్థులైతే స్పోర్ట్స్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌ని స‌రిగా ఉండాలి. ఈ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌న్నీ అడ్మిష‌న్ స‌మ‌యంలో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.

 

తదుపరి వ్యాసం