IGNOU Entrance Test 2024: ఇగ్నో లో బీఈడీ, బీఎస్సీ, పీహెచ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు; ఎంట్రన్స్ టెస్ట్ కు ఇలా అప్లై చేయండి
IGNOU Entrance Test: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) లో బీఈడీ, బీఎస్సీ, పీహెచ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థులు ఆన్ లైన్ లో ignou.ac.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి.
IGNOU Entrance Test: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) ప్రవేశ పరీక్ష 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. B.Ed, B.Sc, Ph.D కోర్సుల్లో అడ్మిషన్ కోరుకునే విద్యార్థులు ఎంట్రన్స్ టెస్ట్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
డిసెంబర్ 31 వరకు..
ఇగ్నోలో బీఈడీ (B.Ed), బీఎస్సీ (B.Sc), పీహెచ్ డీ (Ph.D) కోర్సుల్లో ప్రవేశం కోసం ఇగ్నో (IGNOU) నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ కు అప్లై చేసుకునే అవకాశం డిసెంబర్ 12 న ప్రారంభమైంది. విద్యార్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ జనవరి 7వ తేదీన ఉంటుంది. 2.30 గంటల పాటు జరిగే ఈ పరీక్షను దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహిస్తారు. అప్లికేషన్ ఫీజు రూ. 1000. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్ లైన్ బ్యాంకింగ్ ల ద్వారా ఈ ఫీజును చెల్లించవచ్చు.
How to register: ఇలా అప్లై చేసుకోండి..
B.Ed, B.Sc, Ph.D కోర్సుల్లో అడ్మిషన్ కు వేర్వేరు ఎంట్రన్స్ టెస్ట్ లు ఉంటాయి. వాటికి వేర్వేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షలకు అప్లై చేసుకోవాలనుకునే విద్యార్థులు కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.
- ముందుగా IGNOU అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న IGNOU ప్రవేశ పరీక్ష 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- తాము చేయాలనుకున్న కోర్సుకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ‘న్యూ రిజిస్ట్రేషన్’ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.