తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Edcet 2024: ఆంధ్రప్రదేశ్ ఎడ్‌ సెట్‌ 2024 నోటిఫికేషన్ వచ్చేసింది... ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం

AP EDCET 2024: ఆంధ్రప్రదేశ్ ఎడ్‌ సెట్‌ 2024 నోటిఫికేషన్ వచ్చేసింది... ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Sarath chandra.B HT Telugu

18 April 2024, 11:29 IST

google News
    • AP EDCET 2024: ఏపీ ఎడ్‌ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి తరపున విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎడ్‌ సెట్ నిర్వహించనున్నారు.
ఏపీ బిఇడి సెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఏపీ బిఇడి సెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ఏపీ బిఇడి సెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం

AP EDCET 2024: ఏపీ ఎడ్‌ సెట్‌ online రిజిస్ట్రేషన్లు Registrations ప్రారంభం అయ్యాయి. ఈతల ఏడాది ఆంధ్రా యూనివర్శిటీ Andhra University ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. 2024 జూన్‌ 8వ తేదీన ప్రవేశపరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఎడ్‌ సెట్‌ 2024 ద్వారా రెండేళ్ల బిఇడి కోర్సుతో పాటు స్పెషల్ బిఇడి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.బిఇడి కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

రెగ్యులర్ బిఇడి Regular BED కోర్సుతో పాటు Special Education బిఇడి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌ సెట్‌ 2024 ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. బిఇడి కోర్సుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి. స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ఉండాలి.

బిఇడి కోర్సుకు దరఖాస్తు చేసేవారు బిఏ, బిఎస్సీ, బిఎస్సీ హోమ్‌ సైన్స్, బిఏ ఓరియంటల్ లాంగ్వేజెస్, బికాం, బిసిఏ, బిబిఎం, బిఇ, బిటెక్‌ ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్నా వారు, కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్ Admission సమయానికి మార్కుల జాబితాలను సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత డిగ్రీలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని గ్రూపులు, వికలాంగులకు కనీసం 40శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. బిఇ, బిటెక్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు... మ్యాథ్స్‌ మెథడాలజీలో ప్రవేశం కోసం కనీసం 55శాతం మార్కుల్ని మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో సాధించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు కనీసం 19ఏళ్ల వయసు పూర్తై ఉండాలి.

బిఇడి ప్రవేశ పరీక్ష ఇలా...

ఎడ్‌ సెట్‌ 2024 పరీక్షను ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నాపత్రంతో నిర్వహిస్తారు. రెండు గంటల వ్యవధిలో 150ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పార్ట్‌ ఏలో జనరల్ ఇంగ్లీష్ 25 మార్కులకు ఉంటుంది. పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్‌కు 15 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్‌కు 10మార్కులు ఉంటాయి.

పార్ట్‌ - సి లో ఐదు ఆప్షనల్ సబ్జెక్టులకు 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మ్యాథ్స్‌లో 100 మార్కులకు, ఫిజికల్ సైన్స్‌లో ఫిజిక్స్‌కు 50 ప్రశ్నలు, కెమిస్ట్రీకు 50మార్కులు ఉంటాయి. బయాలజీలో బోటనీకు 50మార్కులు, జువాలజీకి 50మార్కులు ఉంటాయి. సోషల్ స్టడీస్‌లో జాగ్రఫీకి 35మార్కులు, హిస్టరీకి 30మార్కులు, సివిక్స్‌కు 15మార్కులు, ఎకనామిక్స్‌కు 20మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్‌లో 100మార్కులు ఇంగ్లీష్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

బిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు కనీసం 37 మార్కుల్ని సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు లేవు.

బిఇడి కోర్సుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఈ లింకును ఫాలో అవ్వండి….https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx

దరఖాస్తు ఫీజు...

బిఇడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.450ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు రూ.500, ఓసీ అభ్యర్థులు రూ.650 చెల్లించాలి. ఈ లింకుతో బిఇడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయొచ్చు. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx

ముఖ్యమైన తేదీలు ఇవే...

ఏపీ ఎడ్‌ సెట్‌ 2024 నోటిఫికేషన్‌ ఏప్రిల్ 16వ తేదీన విడుదలైంది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 18 గురువారం ఉదయం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

2024 మే 15వ తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. వెయ్యి రుపాయల ఆలస్య రుసుముతో మే 16 నుంచి 19వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.2వేల ఆలస్య రుసుముతో మే 20,21 తేదీలలో స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజుల్ని ఆన్‌లైన్ పద్ధతుల్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

బిఇడి ఎంట్రన్స్‌ దరఖాస్తుల్లో తప్పల్ని సరిచేయడానికి మే 22 నుంచి మే 25వ తేదీ వరకు అనుమతిస్తారు. మే 30వ తేదీ నుంచి హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

బిఇడి ప్రవేశ పరీక్షను జూన్ 8న ఉదయం 9 గంటల నుంచి 11గంటల వరకు నిర్వహిస్తారు. ప్రిలిమినరీ కీని జూన్‌ 15వ తేదీన విడుదల చేస్తారు. జూన్‌ 18వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.

రాష్ట్రంలో 26 జిల్లాల్లో 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాల జాబితాను ఏపీ ఎడ్‌ సెట్‌ 2024 ఇన్ఫర్మేషన్ బుక్‌లెట్‌లో పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం