HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Icar Aieea Exam 2024: అగ్రికల్చర్ లో పీహెచ్ డీ చేయాలనుకుంటున్నారా? నోటిఫికేషన్ వచ్చింది చూడండి..

ICAR AIEEA Exam 2024: అగ్రికల్చర్ లో పీహెచ్ డీ చేయాలనుకుంటున్నారా? నోటిఫికేషన్ వచ్చింది చూడండి..

HT Telugu Desk HT Telugu

13 April 2024, 15:24 IST

  • ICAR AIEEA Exam 2024: ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 13వ తేదీ నుంచి ప్రారంభించింది. విద్యార్థులు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ప్రవేశ పరీక్షలు రాయడానికి ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024
ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024

ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024

ICAR AIEEA Exam 2024: ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ 13వ తేదీ నుంచి ప్రారంభించింది. విద్యార్థులు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ప్రవేశ పరీక్షలు రాయడానికి ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ ద్వారా ఏఐఈఈఏ (PG), ఏఐసీఈ జేఆర్ ఎఫ్, ఏఐసీఈ ఎస్ఆర్ఎఫ్ (PhD) ల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఐసీఏఆర్ ఏఐఈఈఏ అధికారిక వెబ్ సైట్ icarpg.ntaonline.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మే 11

ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024 (ICAR AIEEA Exam 2024) కు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయడానికి చివరితేదీ 11 మే 2024. క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్/ యూపీఐ ద్వారా అప్లికేషన్ ఫీజును చెల్లించవచ్చు. అప్లికేషన్ లో ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి కరెక్షన్ విండో మే 13న ఓపెన్ అవుతుంది. ఈ కరెక్షన్ విండో మే 15న క్లోజ్ అవుతుంది. ఈ ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024ను 2024 జూన్ 29న నిర్వహిస్తారు.

ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024కు ఇలా అప్లై చేయండి

ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024 (ICAR AIEEA Exam 2024) కు అప్లై చేయడానికి విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

  • ఐసీఏఆర్ ఏఐఈఈఏ అధికారిక వెబ్ సైట్ icarpg.ntaonline.in ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024 రిజిస్ట్రేషన్ (ICAR AIEEA Exam 2024 registration) లింక్ పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
  • అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోండి.

ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024 దరఖాస్తు ఫీజు

ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024 కు అప్లై చేయడానికి జనరల్/అన్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు రూ.1200, ఓబీసీ-ఎన్సీఎల్/యూపీఎస్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.1100, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.625 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్/ యూపీఐ ద్వారా ఈ ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ పరీక్షల అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం