APRCET 2024 Exams : పీహెచ్డీ అడ్మిషన్లు - మే 2 నుంచి ఏపీఆర్‌సెట్ పరీక్షలు - ముఖ్య వివరాలివే
APRCET 2024 Updates : ఏపీలో పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే APRCET-2024కి సంబంధించి మరో అప్డేట్ అందింది. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ జారీ కాగా… తాజాగా పరీక్ష తేదీలను ప్రకటించారు అధికారులు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
Andhra Pradesh Research Common Entrance Test 2024: ఆంధ్రప్రదేశ్ లో పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET) 2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా… 20వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ అప్లికేషన్ల ప్రక్రియ మార్చి 19వ తేదీతో ముగిసింది. ఆలస్య రుసుం ఫీజుతో ఏప్రిల్ 6వ తేదీ వరకు గడువు ఉంది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి… కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ ఉన్నత విద్యా మండలి. పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలు… మే 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొంది. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయటంతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ప్రవేశ పరీక్షలు మే 2వ తేదీన ప్రారంభమై… మే 5వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతి రోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఎగ్జామ్స్ ఉంటాయి. మే 8వ తేదీన ప్రిలిమినరీ కీ ని ప్రకటిస్తారు. మే 20వ తేదీన ఇంటర్వూలకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు.
ముఖ్య వివరాలు:
ప్రవేశ పరీక్ష పేరు - ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, APRCET 2024.
ప్రవేశాలు - పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
విభాగాలు- ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ప్లానింగ్, లా తో పాటు మరికొన్ని కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు,
అర్హతలు - డిగ్రీ, పీజీ ఉండాలి. సెట్, నెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.
దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 20, 2024.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - మార్తి 19, 2024.
రూ. 5వేల ఆలస్య రుసుముతో చివరి తేదీ - ఏప్రిల్ 6, 2024.
ఎడిట్ ఆప్షన్ - ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 7, 2024.
ఎంపిక విధానం - ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ ద్వారా తుది జాబితా ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు - శ్రీకాకుళం, విజయవాడ, కడప, విజయనగరం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, ఒంగోలు, అనంతపురం, కాకినాడ, నెల్లూరు, భీమవరం, తిరుపతి, హైదరాబాద్ నగరాలను ఎగ్జామ్ సెంటర్లుగా పెట్టుకోవచ్చు.
పరీక్షల తేదీలు - మే 2 నుంచి మే 5, 2024
ప్రిలిమినరీ కీ - మే 08, 2024.
ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు - మే 10, 2024
ఇంటర్వూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన - మే 20, 2024.
అధికారిక వెబ్ సైట్ - https://cets.apsche.ap.gov.in/
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ - 9030407022.