Megha Electoral Bonds: విరాళాల్లో మేఘా టాప్…ఏపీ, తెలంగాణల్లో అన్ని రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు-megha top in donations huge donations to all political parties in ap and telangana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Megha Electoral Bonds: విరాళాల్లో మేఘా టాప్…ఏపీ, తెలంగాణల్లో అన్ని రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు

Megha Electoral Bonds: విరాళాల్లో మేఘా టాప్…ఏపీ, తెలంగాణల్లో అన్ని రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు

Sarath chandra.B HT Telugu
Mar 22, 2024 10:19 AM IST

Megha Electoral Bonds: ఎలక్టోరల్ బాాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు విరాళాలు అందించిన కంపెనీలో మేఘా ఇంజనీరింగ్ రెండో స్థానంలో నిలిచింది. ఏపీ, తెలంగాణల్లో అన్ని పార్టీలకు బాండ్ల రూపంలో విరాళాలు చెల్లించింది.

అన్ని పార్టీలకు బాండ్ల రూపంలో మేఘా విరాళాలు...
అన్ని పార్టీలకు బాండ్ల రూపంలో మేఘా విరాళాలు... (HT_PRINT)

Megha Electoral Bonds: సుప్రీం కోర్టు Suopreme court ఆగ్రహంతో ఎలక్టోరల్ బాండ్స్‌ గుట్టు వీడింది. ఏ కంపెనీ బాండ్లు ఏ పార్టీకి చేరాయనే వివరాలను ఎన్నికల సంఘానికి ఎస్‌బిఐ SBI అందించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో అగ్ర సంస్థగా ఉన్నమేఘా Megha Engineringఇంజనీరింగ్ ఇండస్ట్రీస్‌ భారీగా బాండ్ల రూపంలో పార్టీలకు విరాళాలు అందించినట్టు వెల్లడైంది.

దేశంలో జారీ చేసిన మొత్తం ఎలక్టోరల్ బాండ్లలో అత్యధికంగా కొనుగోలు చేసిన రెండో సంస్థగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిలిచింది. ఈ సంస్థ కొనుగోలు చేసిన బాండ్లలో అత్యధికంగా రూ.669 కోట్లను బీజేపీకి విరాళాలుగా చేరాయి.

మేఘా కంపెనీ ఇటీవల జోజిలా టన్నెల్ డీల్ తో పాటు ఇతర ప్రాజెక్టులను దక్కించుకుని వార్తల్లో నిలిచింది. గత ఏడాది వరకు తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్‌ పార్టీకి కూడా మేఘా భారీ విరాళాలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భారీ ప్రాజెక్టుల్ని మేఘా సంస్థ చేపట్టింది.

అత్యధికంగా బీజేపీకే…

మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ బాండ్ల రూపంలో సేకరించిన రూ.1232కోట్ల రుపాయల ఎన్నికల బాండ్లలో రూ.669 కోట్లు బీజేపీకి చేరాయి. ఆ కంపెనీ ఇచ్చిన మొత్తం బాండ్లలో సగానికంటే ఎక్కువ బీజేపీ ఖాతాకు చేరాయి. రూ.1232కోట్లలో 54.3శాతం బీజేపీకి దక్కాయి.

మేఘా కంపెనీ ఇచ్చిన విరాళాల్లో 16.3శాతం బిఆర్‌ఎస్ పార్టీకి వెళ్లాయి. తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పెద్ద ఎత్తున సాగు నీటి ప్రాజెక్టుల్ని మేఘాకు కేటాయించింది. మరోవైపు ఎన్నికల బాండ్ల ద్వరా రూ.201 కోట్లను బిఆర్‌ఎస్‌ పార్టీకి మేఘా చెల్లించింది.

మేఘా చెల్లింపుల్లో కాంగ్రెస్‌ పార్టీకి 12.8శాతం దక్కాయి. మేఘా సంస్థ నుంచి రూ.158కోట్లు అందాయి. తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె పార్టీకి కూడా మేఘా నుంచి రూ.85కోట్లు అందాయి. వైసీపీకి రూ.37కోట్లు, టీడీపీకి రూ. 53కోట్లు జనసేనకు రూ.14కోట్లు, బీజేపీడీయూకు రూ.10కోట్లు, జేడిఎస్‌కు 5కోట్లు అందాయి.

బిఆర్‌ఎస్‌ నుంచి వైసీపీ వరకు…

తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరొందిన భారత రాష్ట్ర సమితికి ఆ సంస్థ నుంచి రూ.195 కోట్లు విరాళాలు అందినట్టు తాజా అఫిడవిట్‌లో ఎస్‌బిఐ వెల్లడించింది. తమిళనాడులో అధికార పార్టీ అయిన డీఎంకేకు రూ.85 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రూ.37 కోట్ల విలువైన బాండ్లను మేఘా విరాళంగా ఇచ్చింది. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి రూ.25 కోట్లు, కాంగ్రెస్ కు రూ.17 కోట్లు వచ్చాయి.

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) 2019-20, 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య మొత్తం రూ.966 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. 2020లో జమ్ముకశ్మీర్లో రోడ్డు సొరంగం నిర్మించే ప్రాజెక్టుతో పాటు కొన్ని నగరాల్లో సీఎన్జీ, పైప్డ్ వంటగ్యాస్ రిటైల్ లైసెన్సులను గెలుచుకుంది.

మున్సిపాలిటీలకు పైపులు తయారు చేసే మేఘా ఇంజనీరింగ్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో 1989లో పారిశ్రామికవేత్త పామిరెడ్డి పిచ్చిరెడ్డి ఈ అన్ లిస్టెడ్ ప్రైవేట్ సంస్థను స్థాపించారు. 2006లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌గా పేరు మార్చుకుని ఆనకట్టలు, సహజవాయువు పంపిణీ నెట్వర్క్, విద్యుత్ ప్లాంట్లు, రోడ్లు వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది.

నాలుగేళ్లలో రూ.6వేల కోట్లకు పైగా విరాళాలతో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధిక లబ్ధి పొందిన బీజేపీకి మేఘా ఇంజనీరింగ్, ఫ్యూచర్ గేమింగ్, రిలయన్స్ లింక్డ్ క్విక్ సప్లయ్‌తో పాటు పలు కార్పొరేట్ కంపెనీల నుంచి నిధులు వచ్చాయి.

రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి? బాండ్ల సీరియల్‌ నంబర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. అత్యధికంగా రూ.1368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసిన ఫ్యూచర్‌ గేమింగ్‌ కంపెనీ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా నిధులు సమకూర్చింది. రూ.150 కోట్లను బాండ్ల రూపంలో ఇచ్చినట్లు వెల్లడైందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

సంబంధిత కథనం