YSR Cheyutha Status : వైఎస్ఆర్ చేయూత చెల్లింపుల స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!
03 June 2024, 22:15 IST
- YSR Cheyutha Status : వైఎస్ఆర్ చేయూత నగదును ప్రభుత్వ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. లబ్దిదారులు చెల్లింపుల స్టేటస్ ను ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు.
వైఎస్ఆర్ చేయూత చెల్లింపుల స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!
YSR Cheyutha Status : 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలను స్వావలంబనగా ఏటా వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు. చేయూత చెల్లింపు స్టేటస్ చెక్ చేసుకునే ప్రక్రియను ప్రభుతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న, ఇప్పటికే చేయూత చెల్లింపులు అందుకున్న వారు తమ స్టేటస్ తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అప్లికేషన్ స్టేటస్‌ని తనిఖీ చేసే ప్రక్రియను అధికారులు సులభతరం చేశారు. ఇప్పుడు మహిళలు కూడా ఈ పద్ధతి ద్వారా సులువుగా వారి చెల్లింపుల స్టేటస్‌ను తనిఖీ చేయవచ్చు.
ఏటా రూ.18 వేలు
ఈ పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయాన్ని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. వైఎస్ఆర్ చేయూత నాలుగో దశ చెల్లింపు స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చు. ఏపీ మహిళా సంక్షేమ శాఖ వైఎస్ఆర్ చేయూత స్టేటస్ తనిఖీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. మహిళ సాధికారత పథకాల్లో వైఎస్ఆర్ చేయూత ఒకటి. దీని కింద మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం ఏటా రూ.18 వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేని మహిళలు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఇచ్చే ప్రయోజనాలను 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలు అర్హులు. ప్రతి మహిళకు ఏడాదికి రూ.18,000 అందిస్తారు.
నాలుగో విడత చెల్లింపులు
నాలుగో విడత చెల్లింపుల స్టేటస్ చెక్ లింక్ సోమవారం అందుబాటులోకి వచ్చింది. నాలుగో విడతలో ప్రతి లబ్ధిదారునికి రూ.18,750 ఇచ్చారు. నాలుగేళ్లలో అర్హులైన లబ్ధిదారులకు రూ.75 వేలు సహాయం అందించారు. ఈ సహాయం అందుకోని మహిళలు వీలైనంత త్వరగా వారి చెల్లింపు స్టేటస్‌ను తనిఖీ చేయాలి. స్టేటస్‌ను తనిఖీ చేసేందుకు అధికారిక వెబ్‌సైట్ https://ahd.aptonline.in అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో మహిళలు తమ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, లేదా బెనిఫిషియరీ కోడ్‌ని ఉపయోగించి స్టేటస్ తెలుసుకోవచ్చు. అర్హులైన మహిళల కోసం అధికారిక వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.inని కూడా అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ వెబ్‌సైట్ మహిళలకు చెల్లింపు స్టేటస్‌ను తనిఖీ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది.
చేయూత స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?
- దరఖాస్తుదారులు వైఎస్ఆర్ చేయూత అధికారిక వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in ను సందర్శించాలి.
- హోం పేజీ నుండి “వైఎస్ఆర్ చేయూత పథకం” బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత పేమ్ంట్ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- ఇప్పుడు పథకం, సంవత్సరం ఎంచుకోవాలి.
- అక్కడ ఇచ్చిన బాక్స్‌లో ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాలి.
- క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- చివరిగా గెట్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీని ఎంటర్ చేసి, దిగువ ఉన్న సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి.
- అప్పుడు లబ్ధిదారుని చెల్లింపుల వివరాలు వస్తాయి.
రెండో వెబ్‌సైట్‌ను ఉపయోగించి స్టేటస్ తెలుసుకోవడం ఎలా?
- రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పోర్టల్‌లో అప్లికేషన్ స్థితిని తనిఖీ చేయడానికి, దిగువన ఇచ్చిన దశల వారీ విధానాన్ని ఫాలో అవ్వాలి.
- తొలుత https://ahd.aptonline.in/AHMS/Views/YSRCheyutha/YSRCheyuthaBeneficiaryStatus.aspx లో యాక్సెస్ చేయబడిన అధికారిక వెబ్ పేజీకి వెళ్లాలి.
- హోం స్క్రీన్‌పై వైఎస్ఆర్ చేయూత స్టేటస్‌ను తనిఖీ ఎంపికపై క్లిక్ చేయండి.
- ఫాంలో మీ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ లేదా బెనిఫిషియరీ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- డైన్‌సైడ్‌లో ఇచ్చిన వివరాలను పొందండనే బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ చెల్లింపు స్టేటస్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు