తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Botsa Satyanarayana : పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ కోసం ఆలోచిస్తాం, మార్చి లోపు బకాయిలు చెల్లిస్తాం- మంత్రి బొత్స

Botsa Satyanarayana : పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ కోసం ఆలోచిస్తాం, మార్చి లోపు బకాయిలు చెల్లిస్తాం- మంత్రి బొత్స

23 February 2024, 19:51 IST

google News
    • Minster Botsa Satyanarayana : ఉద్యోగ సంఘాలతో చర్చలపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... పీఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్ ఎందుకని ప్రశ్నించారు. మధ్యంతర భృతి మా విధానం కాదని, పీఆర్సీ ప్రకటిస్తామన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ

Minster Botsa Satyanarayana : పీఆర్సీ ఇస్తామంటున్నప్పుడు, ఐఆర్ ఎందుకుని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలతో(Govt Employees) భేటీ అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదన్నారు. పూర్తి స్థాయిలో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగులకు స్పష్టం చేశామని మంత్రి బొత్స అన్నారు. కరోనా వల్ల పీఆర్సీ ప్రకటించలేకపోయామని, అందుకే ఐఆర్ ఇస్తామన్నామని తెలిపారు. ప్రస్తుతం పీఆర్సీ(PRC)నే ఇస్తామంటే ఇక ఐఆర్‌(IR) ఎందుకని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు(Contract Employees) రెగ్యులర్ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని, కానీ కోర్టు కేసుల వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయిందనన్నారు. మార్చిలోపు ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామన్నారు. పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్‌ కోసం ఆలోచిస్తామన్నారు. చలో విజయవాడ నిరసనను విరమించుకోమని ఉద్యోగులను కోరామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఐఆర్ అడిగితే పీఆర్సీ ఇస్తామంటున్నారు-బండి శ్రీనివాసరావు

ప్రభుత్వం ముందు 49 డిమాండ్ లు ఉంటామని ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతాయన్నారు. జీవోలు ఇచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. 30 శాతం ఐఆర్‌ అడిగితే ప్రభుత్వం పీఆర్సీ ఇస్తామని చెబుతోందని తెలపారు. జీవోలను విడుదలను బట్టి ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గత సమావేశంలో చెప్పిన అంశాలనే మళ్లీ ప్రభుత్వం చెప్పిందన్నారు.

చర్చలు విఫలం-బొప్పరాజు

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ(Ministers Committee) చర్చలు సఫలం కాలేదని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సంప్రదాయం ప్రకారం పీఆర్సీని నియమించినప్పుడు మధ్యంతర భృతి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్, గత పీఆర్సీ(PRC) అరియర్ లు, ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లింపులపై స్పష్టత ఇస్తామని గత సమావేశంలో మంత్రుల కమిటీ చెప్పిందన్నారు. పీఆర్సీ అరియర్ లు రూ.14,800 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ఎప్పుడు చెల్లించేది చెబుతామని గత సమావేశంలో చెప్పారని, దీనిపై స్పష్టత రాలేదన్నారు. మధ్యంతర భృతి ప్రకటనకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని తెలిపారు. ఈ ప్రభుత్వం రివర్సు పీఆర్సీ ఇచ్చిందన్నారు. 12వ పీఆర్సీని జులై 31 లోపే సెటిల్ చేస్తామని మంత్రుల కమిటీ చెప్పిందన్నారు. అందుకే మధ్యంతర భృతి ప్రకటించడం లేదని చెప్పారని తెలిపారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్(Pension) పై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దకరణకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందని బొప్పరాజు ఆరోపించారు.10 వేల మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1300 మందిని మాత్రమే రెగ్యులర్ చేశారన్నారు.

తదుపరి వ్యాసం