తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rice Dal Rates : ఏపీలో మరోసారి బియ్యం, కందిపప్పు ధరలు తగ్గింపు - మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

Rice Dal Rates : ఏపీలో మరోసారి బియ్యం, కందిపప్పు ధరలు తగ్గింపు - మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

31 July 2024, 16:01 IST

google News
    • Rice Dal Rates Decreased : ఏపీలో మరోసారి బియ్యం, కందిపప్పు రేట్లు తగ్గనున్నాయి. కందిపప్పు, బియ్యం, స్టీమ్డ్ రైస్ రేట్లను తగ్గించి రైతు బజార్లు, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
ఏపీలో మరోసారి బియ్యం, కందిపప్పు ధరలు తగ్గింపు - మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
ఏపీలో మరోసారి బియ్యం, కందిపప్పు ధరలు తగ్గింపు - మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

ఏపీలో మరోసారి బియ్యం, కందిపప్పు ధరలు తగ్గింపు - మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

Rice Dal Rates Decreased : బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ రైస్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరోసారి తగ్గించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.160 నుంచి రూ.150కి, బియ్యం కిలో రూ.48 నుంచి రూ.47కి, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.48కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి విక్రయించనున్నామన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలో బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందన్నారు.

బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యం ప్రజలు నిత్యం ఉపయోగించే బియ్యం, కందిపప్పు ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీపై బియ్యం, కందిపప్పు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచి రాయితీ బియ్యం, కందిపప్పు విక్రయించారు. దీంతో పాటు సూపర్ మార్కెట్లలలో కూడా రాయితీపై కందిపప్పు, బియ్యం విక్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గించిన ధరలు నిత్యావసరాలు విక్రయించారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బియ్యం, కందిపప్పు భారీగా విక్రయం అవ్వడంతో మరోసారి ఈ ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోసారి తగ్గించిన ధరలు బియ్యం, కందిపప్పు విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

కందిపప్పు బహిరంగ మార్కెట్ లో దాదాపు కిలో రూ.180 అమ్ముతున్నారని, బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని... ఈ ధరలు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక అవుట్ లెట్లు ప్రారంభించామని మంత్రి నాదెండ్ల తెలిపారు. సివిల్ సప్లైస్‌ అవుట్‌ లెట్లలో కిలో దేశవాళి కందిపప్పు రూ.160కే అందిస్తున్నట్టు చెప్పారు. సోనామసూరి (స్టీమ్డ్) బియ్యం కిలో రూ.49కు , సాధారణ రకం రూ.48 విక్రయిస్తున్నట్టు చెప్పారు. ప్రతి రోజు 125 క్వింటాల కందిపప్పు అందుబాటులో ఉండేటట్లు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజల డిమాండ్ ఆధారంగా దీనిని పెంచుతామన్నారు. రాబోయే రోజుల్లో కందిపప్పు, బియ్యంతో పాటు మిల్లెట్స్, పంచదార, రాగి పిండి తక్కువ ధరకే అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రైతు, వినియోగదారుడికి మేలు జరగాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ ఆకాంక్ష అని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

తదుపరి వ్యాసం