తెలుగు న్యూస్ / ఫోటో /
Rice Dal in Rythu Bazaars: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం,కందిపప్పు-రైతు బజార్లు, రిటైల్ మార్కెట్లలో పౌరసరఫరాల శాఖ కౌంటర్లు
- Rice Dal in Rythu Bazaars : రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రిటైల్ మార్కెట్లలో సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పును ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు.

(1 / 6)
రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రిటైల్ మార్కెట్లలో సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పును ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.
(2 / 6)
పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని రైతు బజార్లలో, ఉషోదయ, మెట్రో, రిలయన్స్, డిమార్ట్ రిటైల్ దుకాణాలలో సరసమైన ధరలలో నాణ్యమైన బియ్యం, కందిపప్పును ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు జేసీ సంపత్ కుమార్ చెప్పారు.
(3 / 6)
ఇప్పటి వరకు 7 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా, 27 రిటైల్ షాపులలో, 96 బియ్యం షాపులలో, 49 పప్పుధాన్యాల షాపులలో నాణ్యమైన బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నట్లు జేసీ తెలిపారు.
(4 / 6)
బహిరంగ మార్కెట్ లో రు.181 ధర ఉన్న కందిపప్పును రు.160లకు, అదేవిధంగా కర్నూలు సోనా మసూరి స్టీమ్ రైస్ బహిరంగ మార్కెట్ లో రూ.55.85 ఉండగా కిలో రు.49లకు, కర్నూలు సోనా మసూరి పచ్చి బియ్యం రు.52.40 నుంచి రూ.48 లకు తగ్గించి అమ్మటానికి చర్యలు తీసుకున్నామన్నారు.
(5 / 6)
ఇప్పటి వరకు పలు దుకాణాల్లో 5335 వినియోగదారులు 227.74 క్వింటాళ్ల బియ్యం, 6923 వినియోగదారులు 83.02 క్వింటాళ్ల కందిపప్పు ప్రత్యేక కౌటర్లలో కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇతర గ్యాలరీలు