APOSS SSC Inter Results : ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
01 July 2024, 22:19 IST
- APOSS SSC Inter Results : ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సీ, ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను https://apopenschool.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు.
ఏపీఓఎస్ఎస్ టెన్త్, ఇంటర ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!
APOSS SSC Inter Results : ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఎస్ఎస్సీ, ఇంటర్(ఏపీఓఎస్ఎస్) ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఎస్.ఎస్.సి పరీక్షలకు 15,058 విద్యార్థులు హాజరుకాగా 63.30 శాతం అంటే 9,531 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 27,279 విద్యార్థులు హాజరు కాగా 18,842 మంది(69.07 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అధికారిక వెబ్ సైట్ https://apopenschool.ap.gov.in లో విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ షార్ట్ మెమోలు
ఏపీ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల షార్ట్ మెమోలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మరేకు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులు ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం షార్ట్ మెమోలను వెబ్ సైట్ నుంచి పొందవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ షార్ట్ మెమోలోని వివరాలను చూసుకోవాలని… ఏమైనా తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి సూచించారు. తప్పులు సరిచేసుకునేందుకు జులై 6వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి షార్ట్ మెమోలను పొందవచ్చు.