తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Summer Holidays : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఈసారి ముందుగానే వేసవి సెలవులు!

AP Summer Holidays : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఈసారి ముందుగానే వేసవి సెలవులు!

19 March 2024, 22:06 IST

    • AP Summer Holidays : ఏపీలో ఈసారి కాస్త ముందుగానే పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా 50 రోజుల పాటు స్కూల్స్ కు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
 వేసవి సెలవులు
వేసవి సెలవులు

వేసవి సెలవులు

AP Summer Holidays : ఏపీలో ఎండలు తీవ్రమవుతున్నాయి. స్కూల్ పిల్లలు ఎండ తీవ్రతతో ఇబ్బంది పడకుండా ఈ ఏడాది కాస్త ముందుగానే వేసవి సెలవులు(AP Schools Summer Holidays) ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మార్చి 18 నుంచి రాష్ట్రంలో ఒంటి బడులు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది తరహా ఈసారి కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో విద్యాశాఖ అధికారులు బడులకు ముందుగానే సెల‌వులు ఇచ్చే ఆలోచ‌న‌ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు?

రాష్ట్రంలో ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేస‌వి సెల‌వులు(AP Summer Holidays) మొదలుకానున్నాయి. జూన్ 13వ తేదీ వ‌రకు దాదాపుగా 50 రోజులు పాటు స్కూళ్లకు వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉందని సమాచారం. గత ఏడాది కంటే ఈసారి సమ్మర్ హాలీడేస్ ఎక్కువగా ఇచ్చే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. అయితే వేసవి సెలవులపై విద్యాశాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ప‌దో త‌ర‌గ‌తి(AP SSC Exams) విద్యార్థుల‌కు పరీక్షలు పూర్తయిన వెంటనే సెలవులు ప్రకటిస్తారు. మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీంతో పదో తరగతి విద్యార్థుల‌కు దాదాపుగా 60 రోజులు పాటు వేస‌వి సెల‌వులు రానున్నాయి. గత ఏడాది స్కూళ్లకు మే 1 తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఒంటిపూట బడులు ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు(AP Half Day Schools) ప్రారంభం అయ్యాయి. విద్యాశాఖ ఆదేశాల మేరకు 1వ తరగతి నుంచి 9వ తరగతి (1 to 9th Class) వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు విద్యార్థులకు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, అన్ ఎయిడెట్, మెడల్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో హాప్ డేస్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు రాష్ట్రంలోని స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించారు. పదో తరగతి(AP SSC Exams) పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లలో పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఒంటిపూట బడుల సమయంలో మధ్యాహ్నం భోజనం(Midday Meal) తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. నిర్దేశించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు అందించాలని అధికారులు పేర్కొ్న్నారు.

తదుపరి వ్యాసం